14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Harish Rao : ఈ వ్యాఖ్యలు గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటి సోచ్ కి నిదర్శనం

Date:

Harish Rao : జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత వృద్ధి చెందేలా చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే “చోటి సోచ్” అని అవమానించడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు.ఈ వ్యాఖ్యలు గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటి సోచ్ కి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి. సెస్సులు, సర్ ఛార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతున్నదని, చెబుతున్నది 41శాతం అయినా, రాష్ట్రాలకు నిజంగా అందుతున్నది మాత్రం 30శాతమే అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తే, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఖర్చు చేసేవీలుంటుందని, కానీ సెస్ రూపంలో వసూలు చేసి కేంద్రం తన ఇష్టం వచ్చిన రీతిలో, అంటే తమకు ఇష్టమైన రాష్ట్రాలకు ఇవ్వడం, తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపడం చేస్తోందని హరీష్‌ రావు మండిపడ్డారు. ఇలా ఆర్థిక అధికారాలు తమ దగ్గర పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది.

Atchannaidu: ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి

రాష్ట్రాలు కేంద్రం వద్ద మోకరిల్లాలని చూస్తోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం కాదా? ఇదేనా మీరు వల్లించే టీమ్ ఇండియా స్పూర్తి? అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు పన్నుల్లో వాటా పెంచామని ప్రచారం చేసుకుంటూ, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, వివిధ కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలను కుదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాలుగా నష్టపోతున్నది వాస్తవం కాదా?అని హరీష్‌ రావు అన్నారు. రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడితే అవమానకరంగా మాట్లాడటం స్థాయికి తగదు. పీయూష్ గోయల్ గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని, గ్రోత్ ఇంజన్ గా ఉన్న తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధే.. భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నామన్నారు హరీష్‌ రావు.

Chinese Apps: భారత్‌లోకి మళ్లీ తిరిగొచ్చిన 36 చైనా యాప్‌లు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೃಷ್ಣ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ: ಸರ್ವಪಕ್ಷ ಸಭೆ ಕರೆದಿದ್ದೇವೆ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬಾಗಲಕೋಟೆ,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in) : ಕೃಷ್ಣ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ ಸಂಬಂಧ ನವದೆಹಲಿಯಲ್ಲಿ...

കരുതലിന്റെ കാതല്‍; വയനാട് ടൗണ്‍ഷിപ്പിലെ താമസക്കാര്‍ക്ക് സാധന സാമഗ്രികള്‍ വാങ്ങാന്‍ ഒരു ലക്ഷം വീതം

തിരുവനന്തപുരം: ഒരുക്കിയ വയനാട് ടൗണ്‍ഷിപ്പിലെ താമസക്കാര്‍ക്ക് കൂടുതല്‍ ധനസഹായവുമായി സംസ്ഥാന സര്‍ക്കാര്‍....

"தேர்தலில் போட்டியிடும்படி மோடியின் பிரதிநிதி என்னை சந்தித்தார்" – எம்.பி ஆக ஆசைப்படும் ஐ.எம்.விஜயன்

கேரளாவில் விரைவில் சட்டசபை தேர்தல் நடைபெற உள்ளது. கேரளாவைச் சேர்ந்த இந்தியக்...

War Effect : తెలంగాణలో వార్ ఎఫెక్ట్.. చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర చరిత్రలో...