15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

JEE Main 2025 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు తేజాలు

Date:

జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో మొత్తం 14 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఐదుగురు రాజస్థాన్‌కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్‌ సాధించారు.

READ MORE: Bird Flu In AP: నిమిషాల వ్యవధిలోనే చనిపోతున్న కోళ్లు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న పౌల్ట్రీ నిర్వాహకులు..

ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్‌ -1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా 12,58,136మంది రాశారు. ఇదిలా ఉండగా.. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారికి మరో అవకాశం ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు.

READ MORE: Beauty Tips: ముఖంపై మచ్చలు, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి

ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి?
ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in కి వెళ్లండి. తరువాత సెషన్ 1 స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ ఫలితాన్ని చూసి డౌన్‌లోడ్ చేసుకోండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പൂനെയില്‍ പൊതുസ്ഥലത്ത് നോമ്പ് തുറക്കുന്നത് ചോദ്യം ചെയ്ത് യുവാക്കളെ ആക്രമിച്ചു; അഞ്ച് പേര്‍ക്ക് പരിക്ക്; 15 പേര്‍ പിടിയില്‍

പൂനെ: പൂനെ അക്‌സര്‍വാഡിയില്‍ കുളത്തിനരികെ നോമ്പ് തുറയ്ക്കായി ഒത്തുകൂടിയ മുസ്‌ലിം യുവാക്കളെ...

“உளவுத் துறையைக் கையாளப் போகும் முதல் பெண் டி.ஜி.பி”- அதிரடி மாற்றங்களைக் கையில் எடுத்த அரசு!

தமிழகத்தில் கடந்த சில நாட்களாக நடந்துவந்த குற்றசெயல்களும், அதை தொடர்ந்து...

Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. ఇది విషతుల్యాలను తొలగించడం,...