9
March, 2026

A News 365Times Venture

9
Monday
March, 2026

A News 365Times Venture

Elections In AP: నేడు రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు హోరాహోరీగా ఎన్నికలు

Date:

Elections In AP: ఆంధ్రప్రదేశ్‌లో నేడు (ఫిబ్రవరి 3)న 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లను కాపాడుకోవాలని, వైసీపీ వీటిని గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also Read: Municipal Chairperson: నేడు హిందూపురంలో 144 సెక్షన్..

తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్ లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీ లలో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీ లలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తన సీట్లను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో పార్టీ సభ్యులు విప్‌ను ధిక్కరించరాదని హెచ్చరికలు జారీ చేసింది.

విప్‌ను ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు, టీడీపీ కూడా ఎన్నికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో గెలుపు కోసం క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. అభ్యర్థులకు బలమైన ప్రలోభాలు చూపిస్తూ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే, అక్కడక్కడా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ విభాగం, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు ఏం ఉంటాయో, ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്രതിരോധം മാത്രം, സംഘര്‍ഷത്തിലേക്ക് രാജ്യത്തെ വലിച്ചിഴക്കില്ല; ഇറാനെ ആക്രമിച്ചെന്ന ഇസ്രഈല്‍ വാദം തള്ളി യു.എ.ഇ

അബുദാബി: ഇറാനില്‍ നിന്നുള്ള തുടര്‍ച്ചയായ വ്യോമാക്രമണത്തിന് മറുപടിയായി യു.എ.ഇ ഇറാനിലെ ജലശുദ്ധീകരണ...

ஈரோட்டில் 'மக்களைக் காப்போம்; தமிழகத்தை மீட்போம்' பயணம்; இபிஎஸ் ஆவேசப் பேச்சு | Photo Album

மிரட்டும் பா.ஜ.க, முரண்டு பிடிக்கும் எடப்பாடி - தொகுதிப் பங்கீட்டில் யார்...

Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి...

ഒസ്മാന്‍ ഹാദിയുടെ കൊലപാതകം; രണ്ട് പേരെ അറസ്റ്റ് ചെയ്ത് ബംഗാള്‍ പൊലീസ്

ധാക്ക: ബംഗ്ലാദേശിലെ വിദ്യാര്‍ത്ഥി നേതാവ് ഷെരീഫ് ഒസ്മാന്‍ ഹാദിയുടെ കൊലപാതകവുമായി ബന്ധമുണ്ടെന്ന്...