DGP Dwaraka Tirumala Rao: పిఠాపురంలో క్రైమ్ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆస్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను అని స్పష్టం చేశారు.. అటువంటిది ఉంటే అడ్రస్ చేస్తామని వెల్లడించారు.. అయితే, సైబర్ క్రైమ్ పెరిగింది.. విజిబుల్, ఇమేజింగ్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.. మెన్‌లతో కాకుండా డ్రోన్ ల ద్వారా కూడా ఫోకస్ పెడతాం.. ఏఐ ద్వారా కేసులు పరిష్కారం చేస్తాం అన్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలని కట్టడి చేస్తున్నాం.. సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ అయిపోయాయి.. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను ఆరు నెలల్లో పరిష్కారం చేశాం.. టెక్నాలజీ ఉపయోగించి కేసులు పరిష్కారం చేస్తాం అన్నారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవ్ కి రివార్డు ఎంతంటే?
మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. నిన్న సాయంత్రానికే విచారణ పూర్తి కావాల్సింది. మరో రోజు అదనంగా విచారణకు సమయం కోరారన రాజమహేంద్రవరం పర్యటనలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేసిన విషయం విదితమే.. విజయనగరం జిల్లా ఏజెన్సీలో పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ పోలీసు అధికారి, ఇంటిపై డ్రోన్ ఘటనలను వేరువేరుగా చూస్తున్నాం అన్నారు.. ఇక, గతం కంటే ఈసారి సంక్రాంతికి కోడి పందాలు ఎక్కువగా జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. కోడి పందాలకు సంబంధించి కేసులు అయితే ఎక్కువగానే నమోదు చేశామని డీజీపీ ద్వారకా తిరుమలరావు.





