20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం

Date:

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో ఆరో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. కార్తీక శుద్ధ దశమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నరేంద్ర చౌదరి నేతృత్వంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో 15వ ఏటా సాగుతున్న ఈ ఆధ్యాత్మిక మహా యజ్ఞానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజలు, దీపారాధనకు అవసరమైన సామాగ్రిని నిర్వాహకులే ఉచితంగా పంపిణీ చేయగా, భక్తులు ఉత్సాహంగా దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

ప్రత్యేక పూజలు, ప్రవచనాలు

ఆరో రోజు వేడుకల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక ఘట్టాలు కన్నుల పండువగా సాగాయి. శ్రీవాసనందగాపురం శ్రీలలితాపీఠం పీఠాధిపతి శ్రీ స్వస్వరూపానందగిరి స్వామీజీ, అనంతరం రామకృష్ణ మరం స్వామీజీల అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకుంది. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనామృతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. వేదికపై సద్గురు షిరిడీ సాయినాథునికి నిజపాదుక పూజ నిర్వహించగా, భక్తులచే సాయిబాబా విగ్రహాలకు కోటీపుష్పార్చన జరిగింది. అనంతరం కల్పవృక్ష వాహనంపై స్వామివారి సేవ, స్వర్ణలింగోద్భవం, సప్తహారతలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

హరీష్ రావు ప్రసంగం.. దీపం ప్రాముఖ్యత

ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఒక దీపం వెలిగిస్తే ఇంటికి వెలుగని, కోటి దీపాలు వెలిగిస్తే జగత్తుకు వెలుగని పేర్కొన్నారు. కోటి దీపాలు వెలిగించడం అంటే దేశంలోని ప్రజలందరి కోరికలు నెరవేరాలని ప్రార్థించడమేనని చెప్పారు. ఒక దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందవచ్చని, హిందూ ధర్మంలో దీపానికి ఉన్న విశిష్టతను ఈ మహా యజ్ఞం చాటి చెబుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాల నుంచి దైవ విగ్రహాలను తీసుకువచ్చి పూజలు నిర్వహించడం, రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం చేస్తున్న ఆధ్యాత్మిక సేవపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమైంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വ്യാജ ഫോം ഏഴ് അപേക്ഷ നൽകുന്ന ബൂത്ത് ലെവൽ ഏജന്റുമാർക്കെതിരെ നടപടിക്ക് പരിമിതിയെന്ന് സുപ്രീംകോടതി

ന്യൂദൽഹി: വ്യാജ കാരണങ്ങൾ ചൂണ്ടിക്കാട്ടി വോട്ടർപട്ടികയിൽനിന്ന് വോട്ടർമാരുടെ പേരുകൾ നീക്കം ചെയ്യാൻ...

വോട്ടർ പട്ടിക പരിഷ്കരണത്തിലൂടെ ഇന്ത്യ ന്യൂനപക്ഷങ്ങളെ ലക്ഷ്യമിടുന്നതായി യു.എസ് മതസ്വാതന്ത്ര്യ സമിതി

വാഷിങ്ടൺ: രാജ്യവ്യാപകമായി നടന്ന വോട്ടർ പട്ടിക പരിഷ്കരണത്തിലൂടെ ഇന്ത്യ മതന്യൂനപക്ഷങ്ങളെ ലക്ഷ്യമിടുന്നത്...

"வி.எஸ்.பாபு உடல்நிலை குறித்து மௌனம் காத்தது மனித உரிமை மீறல்" – டாக்டர் கிருஷ்ணசாமி கூறுவது என்ன?

"ஒரு மக்கள் பிரதிநிதியின் உடல்நிலை குறித்து மூன்று மாதங்கள் மருத்துவமனையும், அரசும்...