14
November, 2026

A News 365Times Venture

14
Saturday
November, 2026

A News 365Times Venture

CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!

Date:

CS Karnan Dies: వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ఎస్. కర్ణన్ (71) కన్నుమూశారు. శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. అనేక వివాదాస్పద తీర్పులతో కర్ణన్ ప్రసిద్ధి చెందారు. 2017లో కోల్‌కతాలోని తన నివాసాన్నే తాత్కాలిక కోర్టుగా ప్రకటించి, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఇది ఆ సమయంలో సంచలనంగా నిలిచింది. ఇదే కాకుండా వారికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు ధిక్కార నేరం కింద ఆయనకే 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇలా జైలుకు వెళ్లిన తొలి సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిగా కర్ణన్ చరిత్రలో నిలిచారు.

ప్రధాని మోడీకి లేఖ..

2017 జనవరిలో కర్ణన్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసి, 20 మంది ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యం ఫిబ్రవరి 8న అప్పటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనపై ధిక్కార చర్యలు ప్రారంభించింది. కర్ణన్‌కు అప్పగించిన న్యాయపరమైన, పరిపాలనాపరమైన బాధ్యతల్ని కూడా ఉపసంహరించుకుంది. మార్చి 31న కర్ణన్ సుప్రీంకోర్టు ముందు హాజరైన ఆయన, తన అధికారాలను తిరిగి ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం అందుకు నిరాకరించింది.

సుప్రీం న్యాయమూర్తులకు సమన్లు..

దీంతో ఏప్రిల్ 13న ఆయన దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలోని న్యూ టౌన్ లో ఉన్న తన రోస్‌డేల్ నివాసానికి విచారణ కోసం హాజరు కావాలని సీజేఐ ఖేహర్‌తో పాటు మరో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరుకావాలని ఆదేశించారు. తన నివాసమే తాత్కాలిక కోర్టుగా మారిందని కర్ణన్ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమపై కుల వివక్షకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 5 ఏళ్ల శిక్షకు ఆదేశాలు..

దీని తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరుకాకపోవడంతో వారు విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని, కుల వివక్ష ఆరోపణలు చేసినందుకు వారి పాస్‌పోర్టులు అప్పగించాలని ఆదేశించారు. మే 2న అప్పటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్‌తో పాటు మరో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. ఈ వారెంట్లను ఢిల్లీ పోలీసుల ద్వారా అమలు చేయించాలని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. ఇదే కాకుండా మే 8న సీజేఐ ఖేహర్ సహా 8 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు కర్ణన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ జాబితాలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జె. చెలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్. బానుమతి ఉన్నారు.

సిట్టింగ్ హైకోర్టు జడ్జిగా జైలుకు..

కర్ణన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతి రోజే, 2017 మే 9న సుప్రీంకోర్టు అతడిపై ధిక్కార నేరంలో దోషిగా తేల్చింది. 6 నెలల జైలు శిక్ష విధించింది. ఆయన ప్రవర్తన న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కర్ణన్ వెంటనే పోలీసులకు చిక్కుండా, నెల రోజుల పాటు అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. చివరకు జూన్ 20న కోయంబత్తూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు. శిక్ష తర్వాత డిసెంబర్ 2017లో విడుదలయ్యారు.

2020లో మరోసారి అరెస్ట్..

2017లో అరెస్ట్ తర్వాత, 2020లో మరోసారి కర్ణన్ అరెస్టయ్యారు. 020 డిసెంబరులో న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, లైంగిక హింసకు సంబంధించిన బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వీడియోల వ్యవహారంలో చెన్నై పోలీసులు ఆయనను మరోసారి అరెస్టు చేశారు. అనంతరం పుళల్ జైలులో ఉంచారు. 2021 మార్చిలో మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

9/11നുശേഷം രണ്ടാമത്തെ ഗ്രൗണ്ട് സ്റ്റോപ്പ്; അമേരിക്കയുടെ ആകാശം സുരക്ഷിതമാണോ?

9/11 ആക്രമണത്തിനുശേഷം രാജ്യവ്യാപകമായി വിമാനങ്ങളുടെ പുറപ്പെടല്‍ തടഞ്ഞ രണ്ടാമത്തെ ഗ്രൗണ്ട് സ്റ്റോപ്പ്...

வந்தே பாரத் Sleeper ரயிலில் RAC இருக்கை ரத்து; விரைவில் அனைத்து ரயில்களிலும் RACக்கு முற்றுப்புள்ளி?

நீண்ட தூர ரயில்களில், உறுதிப்படுத்தப்பட்ட சீட்கள் முடிந்த பிறகு டிக்கெட் முன்பதிவு...

திருப்பதி: 'ஒரு கிலோ முடி ரூ.84 ஆயிரம்' – பக்தர்கள் செலுத்திய முடி ரூ.119 கோடிக்கு விற்பனை

திருப்பதி ஏழுமலையான் கோயிலுக்குச் செல்பவர்கள் மொட்டை போட்டுக்கொள்வது வழக்கம். ஏழுமலையானைத் தரிசிக்க...