12
November, 2026

A News 365Times Venture

12
Thursday
November, 2026

A News 365Times Venture

Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..

Date:

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని కోర్ ఏరియాలతో పాటు మాదాపూర్ వంటి ప్రముఖ ప్రాంతాలలో రాత్రింబవళ్ళు నడుస్తున్న క్లౌడ్ కిచెన్లపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏకంగా 25 ప్రత్యేక బృందాలతో ఈ ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు. క్లౌడ్ కిచెన్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేశారని, కనీస శుభ్రత పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులు గుర్తించారు. తనిఖీలు జరిగిన చాలా చోట్ల దారుణమైన పరిస్థితులు వెలుగు చూశాయి.

కిచెన్లలో నిర్వహించిన సోదాల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. ఏకంగా 15 బాక్సుల హానికరమైన ఫుడ్ కలర్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంటకాల్లో విపరీతంగా రంగులను కలుపుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. అంతేకాకుండా, గడువు ముగిసిన సగ్గుబియ్యం, పురుగులు పట్టిన బొంబాయి రవ్వ వంటి నాసిరకం సరుకులను వంట తయారీకి వాడుతున్నట్లు తేలింది. ఆహారం తయారయ్యే వంట గదులు, నిల్వ ఉంచే గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు స్వేచ్ఛగా తిరుగుతుండటం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. కూరగాయలు, ఇతర పదార్థాలు కట్ చేయడానికి ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

ఈ దాడుల అనంతరం అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన కొన్ని క్లౌడ్ కిచెన్ సెంటర్లను తక్షణమే మూసివేశారు. మరికొన్ని కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, లోపాలు సరిదిద్దుకోవాలని హెచ్చరిస్తూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందజేశారు. ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో అందంగా కనిపించే ఈ కిచెన్ల వెనుక ఇంతటి అనారోగ్యకరమైన వాతావరణం ఉండటం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. బయట దొరికే ఆహారాన్ని, ముఖ్యంగా క్లౌడ్ కిచెన్ల నుంచి ఆర్డర్ చేసే పదార్థాలను తినేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టేనని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വളര്‍മതിയെ ബലം പ്രയോഗിച്ച് ആശുപത്രിയിലേക്ക് മാറ്റി; സമരപ്പന്തില്‍ പൊളിച്ചുനീക്കി പൊലീസ്

തിരുവനന്തപുരം: എല്‍.പി.എസ്.ടി ഉദ്യോഗാര്‍ത്ഥികളുടെ സമരപ്പന്തല്‍ പൊളിച്ചുനീക്കി പൊലീസ്. സമര സമിതി നേതാവ്...

Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా...

ആര്‍.എസ്.എസുമായോ ബി.ജെ.പിയുമായോ തനിക്ക് ബന്ധമില്ല: സോണിയ ഗാന്ധിയുടെ ആരോപണത്തില്‍ പ്രതികരിച്ച് അണ്ണാ ഹസാരെ

ന്യൂദല്‍ഹി: 2012ല്‍ അഴിമതി വിരുദ്ധ സമരം ബി.ജെ.പിയും ആര്‍.എസ്.എസും ആസൂത്രണം ചെയ്തതാണെന്ന...