9
November, 2026

A News 365Times Venture

9
Monday
November, 2026

A News 365Times Venture

Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..

Date:

Cheyutha Pensions: తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ వేళ తీపి కబురు అందించింది. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 4.5 లక్షల మంది అర్హులకు ‘చేయూత’ పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. నవంబర్ 8న వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై, మంత్రి సీతక్కతో కలిసి లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

సామాజిక భద్రతే ప్రధాన ధ్యేయంగా చేపట్టిన ఈ పంపిణీలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులతో పాటు మరికొందరు నూతన లబ్ధిదారులకు పెద్దపీట వేశారు. కోడంగల్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన వెంటనే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో పంపిణీ మహోత్సవాలు జరగనున్నాయి. నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు ఈ నవంబర్ నెల నుంచే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీపావళి వేళ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతూ ఆర్థిక భరోసా కల్పించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా పింఛన్లు అందజేస్తామని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അഭയാര്‍ത്ഥി ക്യാമ്പുകളെ ബാധിച്ച വെള്ളപ്പൊക്കം; ഗസയിലേക്ക് കൂടുതല്‍ സഹായങ്ങള്‍ എത്തിക്കേണ്ടതുണ്ടെന്ന് യൂറോപ്യന്‍ യൂണിയന്‍ കമ്മീഷണര്‍

ഗസസിറ്റി: ഗസയിലെ അഭയാര്‍ത്ഥി ക്യാമ്പുകളില്‍ വെള്ളപ്പൊക്കം ഉണ്ടായ സാഹചര്യത്തില്‍, കൂടുതല്‍ സഹായങ്ങള്‍...

190 குழந்தைகளின் மரணம்… மதவழிபாட்டின் பெயரில் கொடூரம்: தலைவருக்கு 200 ஆண்டுகள் சிறை!

கடவுளைச் சந்திக்க வேண்டும் என்பதற்காகப் பசியுடன் இருந்தால் சொர்க்கத்துக்குச் செல்லலாம் என்று...

മോദിക്ക് നല്ല നിരാശയുണ്ട്; സഞ്ചിയുമെടുത്ത് മടങ്ങാന്‍ സമയമായി: ദിമാഗി നക്‌സല്‍ പരാമര്‍ശത്തെക്കുറിച്ച് കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി തന്റെ രാഷ്ട്രീയ എതിരാളികളെ ‘ദിമാഗി നക്‌സലുകള്‍’...

"புகார் கொடுத்தும் போலீஸ் நியாயமா நடந்துக்கல.!" – ஆடுகளை கொன்ற அமைச்சர் ஜெகதீஸ்வரியின் சித்தப்பா?

அமைச்சரானதும் ஊர்க்கிணற்றைப் பூட்டிட்டாங்க ஜெகதீஸ்வரி – வருந்தும் சொந்த கிராம மக்கள்இப்படியொரு...