8
November, 2026

A News 365Times Venture

8
Sunday
November, 2026

A News 365Times Venture

Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..

Date:

Shubman Gill: ‘135 పరుగులే కదా.. చాలా ఈజీగా ఛేజ్ చేయొచ్చని అనుకున్నా. కానీ మ్యాచ్ పిచ్ బ్యాటింగ్‌కు అంత తేలిగ్గా లేదు’ అని న్యూజిలాండ్‌తో (New Zealand) జరిగిన మ్యాచ్ విజయం అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వ్యాఖ్యానించాడు. వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా, ఛేజింగ్ మాత్రం కత్తిమీద సాములా మారింది. ఒకానొక దశలో టీమిండియా (Team India) 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే కేఎల్ రాహుల్ (KL Rahul) 26 పరుగులతో చాకచక్యంగా రాణించడంతో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట నిలిచిపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి (DLS Method) ప్రకారం టీమిండియాను విజేతగా ప్రకటించారు.

ఈ విజయంపై గిల్ స్పందిస్తూ.. “ఎలాగైతేనేం అంతిమంగా గెలిచాం అదే ముఖ్యం. మొదట 135 రన్స్ టార్గెట్ అనగానే చాలా సులువుగా మ్యాచ్ పూర్తి చేయవచ్చని భావించాను. కానీ క్రీజులోకి దిగాక పిచ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా అనిపించింది. చివరికి విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నా, అనుకున్న దానికంటే ఒక రెండు వికెట్లు ఎక్కువ కోల్పోయాం” అని మ్యాచ్ ముగిసిన తర్వాత పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌తో ఆకట్టుకున్న యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్‌ బ్రార్‌ (Gurnoor Brar) పై కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో బ్రార్ కేవలం 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. “గత మ్యాచ్‌లో కూడా గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతని దగ్గర మంచి పేస్ (Pace), బౌన్స్ (Bounce) ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ అంటేనే ఒత్తిడిని జయించడం. అనుభవం పెరిగే కొద్దీ బ్రార్ బౌలింగ్‌లో మరింత స్థిరత్వం వస్తుంది” అని గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక, ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వర్షం ప్రభావిత వాతావరణంలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (Daryl Mitchell) 104 బంతుల్లో 55 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ (Virat Kohli), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), అక్షర్ పటేల్ (Axar Patel) లాంటి కీలక బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. భారత్ గెలుపుకు 66 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన సమయంలో వర్షం తీవ్రమవడంతో ఆటను నిలిపివేశారు. డక్ వర్త్ లూయిస్ లెక్కల ప్రకారం భారత్ 4 పరుగుల తేడాతో గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (ODI Series) మొదటి మ్యాచ్‌ను 5 వికెట్లతో గెలుచుకున్న ఇండియా, ఇప్పుడు ఈ విజయంతో 2-0 తో ఆధిపత్యంలో నిలిచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ஈரான் – அமெரிக்கா: `அதிகரிக்கும் பதற்றம்: தொடர்ந்து கேட்கும் வெடிகுண்டுச் சத்தம்' – என்ன நடக்கிறது?

ஈரானுக்கும் - அமெரிக்காவுக்கும் இடையே பதற்றம் அதிகரித்திருக்கிறது. பாரசீக வளைகுடா...

കാനറി ദ്വീപുകളിൽ അഭയാർത്ഥി പ്രവാഹം: എൽ ഹിയേറോയിൽ അടിയന്തരാവസ്ഥ പ്രഖ്യാപിച്ചു

മാഡ്രിഡ്: പടിഞ്ഞാറൻ ആഫ്രിക്കയിൽ നിന്നുള്ള കുടിയേറ്റക്കാരും അഭയാർത്ഥികളും ബോട്ടുകളിൽ കൂട്ടത്തോടെ എത്തിയതിനെത്തുടർന്ന്...