8
November, 2026

A News 365Times Venture

8
Sunday
November, 2026

A News 365Times Venture

AP HRC: “నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి”.. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ

Date:

AP HRC: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో చోటుచేసుకున్న తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. అక్టోబర్ 31, 2026న గణితం పాఠం జరుగుతుండగా, హేమంత్ (21) అనే వ్యక్తి రన్నింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ చైన్‌సాతో తరగతి గదిలోకి చొరబడి 10వ తరగతి విద్యార్థినిపై దారుణంగా దాడి చేశాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన లక్ష్మి అనే మరో విద్యార్థినికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ రక్తపు మడుగులో వదిలి నిందితుడు పరారయ్యాడు. పాఠాలు చెబుతున్న సమయంలో గుర్తుతెలియని బయటి వ్యక్తిని అనుమతించడం సిబ్బంది భద్రతా వైఫల్యానికి నిదర్శనమని కమిషన్ మండిపడింది. పాఠశాలల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆక్షేపించింది. ఈ ఘోరంపై హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి, సభ్యులు జె.వి. మనోహర్ రెడ్డి స్పందిస్తూ.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, అనంతపురం కలెక్టర్, డీఈఓలకు నోటీసులు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా మార్గదర్శకాల అమలుపై 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 4, 2026కి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా.. రాప్తాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన ఉన్మాది హేమంత్‌ కుడికాలును వైద్యులు ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందాడు. కాల్పుల ఘటనలో అతడి కాళ్లలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావమైంది. కుడి కాలికి రక్తప్రసరణ చేసే నాళాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొడ కింది భాగం నల్లగా మారి కుళ్లిపోయినట్లు వైద్యుల బృందం నిర్ధారించిందని సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి రెండ్రోలు కిందట తెలిపారు. కాలును తొలగించకపోతే ఇన్‌ఫెక్షన్‌ శరీరమంతా పాకి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందని, అందుకే వైద్యుల బృందం మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 వరకు శస్త్రచికిత్స చేసి, కుడి కాలును తొలగించారని ఆమె వివరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിവാദങ്ങൾ സർക്കാർ പരിഹരിക്കും; ഭരണരംഗത്ത് പൂർണ നിയന്ത്രണമുണ്ടെന്ന് കെ.സി. വേണുഗോപാൽ

ആലപ്പുഴ: സംസ്ഥാനത്തെ ഭരണരംഗത്തെ വിവാദങ്ങൾ പരിഹരിക്കാൻ സർക്കാരിന് പൂർണ ശേഷിയുണ്ടെന്നും, എന്നാൽ...

ஈரான் – அமெரிக்கா: `அதிகரிக்கும் பதற்றம்: தொடர்ந்து கேட்கும் வெடிகுண்டுச் சத்தம்' – என்ன நடக்கிறது?

ஈரானுக்கும் - அமெரிக்காவுக்கும் இடையே பதற்றம் அதிகரித்திருக்கிறது. பாரசீக வளைகுடா...

കാനറി ദ്വീപുകളിൽ അഭയാർത്ഥി പ്രവാഹം: എൽ ഹിയേറോയിൽ അടിയന്തരാവസ്ഥ പ്രഖ്യാപിച്ചു

മാഡ്രിഡ്: പടിഞ്ഞാറൻ ആഫ്രിക്കയിൽ നിന്നുള്ള കുടിയേറ്റക്കാരും അഭയാർത്ഥികളും ബോട്ടുകളിൽ കൂട്ടത്തോടെ എത്തിയതിനെത്തുടർന്ന്...