6
November, 2026

A News 365Times Venture

6
Friday
November, 2026

A News 365Times Venture

CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..

Date:

CM Chandrababu Aerial Survey: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు ఎదురుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర బృందానికి సీఎం వివరించారు.

వీబీ జీ రామ్ జీ పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచాలని,అర్హులైన కరువు బాధితులకు రేషన్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ విస్తరణతో పాటు పంటల బీమా పరిహారాన్ని త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం, 15 రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపింది.

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని తుఫాన్ నష్టాన్ని సీఎం పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు.. గ్రామాలను చుట్టి ముట్టిన నీరు, దిగ్భంధమైన రోడ్లను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബെംഗളൂരു മെട്രോ വികസിച്ചത് മോദി സര്‍ക്കാര്‍ കാരണമെന്ന് തേജസ്വി സൂര്യ: 87 ശതമാനം വിഹിതം സംസ്ഥാനസര്‍ക്കാരിന്റേതെന്ന് കോണ്‍ഗ്രസ്

ബെംഗളൂരു: ബെംഗളൂരു മെട്രോ കേന്ദ്രത്തിന്റേതോ സംസ്ഥാനത്തിന്റേതോ എന്ന് പരസ്പരം പോരടിച്ച് ബി.ജെ.പിയും...

ஜெகன் மோகன் ரெட்டி இல்லத் திருமண விழா; முதல்வர் விஜய், தொழிலதிபர் அதானி பங்கேற்பு!

சென்னையில் நடைபெற்ற ஆந்திர முன்னாள் முதல்வர் ஜெகன் மோகன் ரெட்டி இல்லத்...

ഇസ്രഈല്‍: സര്‍ക്കാര്‍ രൂപീകരണത്തിന് ഐസന്‍കോട്ടിനെ പിന്തുണയ്ക്കുമെന്ന് ജോയിന്റ് ലിസ്റ്റ്

ടെല്‍ അവീവ്: പുതിയ ഇസ്രഈല്‍ സര്‍ക്കാര്‍ രൂപീകരിക്കുന്നതിനായി പ്രതിപക്ഷ നേതാവ് ഗാഡി...