4
November, 2026

A News 365Times Venture

4
Wednesday
November, 2026

A News 365Times Venture

Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?

Date:

Railway Track Blast:  రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. శ్రీగంగానగర్ జిల్లాలో రైలును పేల్చేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనూప్‌గఢ్‌–సూరత్‌గఢ్‌ రైల్వే మార్గంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రైల్వే పట్టాల కింద ఉన్న రెండు నుంచి మూడు సిమెంట్ స్లీపర్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అనూప్‌గఢ్ నుంచి బటిండాకు వెళ్తున్న రైలు ఆ ప్రాంతాన్ని దాటిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

అనూప్‌గఢ్‌–సూరత్‌గఢ్‌ రైల్వే లైన్‌లోని 50 జీబీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు సిమెంట్ దిమ్మెల నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. రైల్వే పట్టాలకు బిగించే క్లిప్పులు సైతం విడిపోయాయి. అనూప్‌గఢ్ నుంచి బటిండా వెళ్లే రైలును లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలకు పాల్పడిఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, పేలుడు వెనక కారణాలు, ఇతర వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

సమాచారం తెలియడంతో జిల్లా ఎస్పీ హరిశంకర్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్‌), ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. బాంబ్ స్వ్కాడ్ కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ హరిశంకర్‌ వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dool In-Depth: ഫ്രീസറിലെ താപനില 50 ഡിഗ്രിയായി ചൂടാക്കുന്നത് ആരാണ്; യൂറോപ്പിലെ സൂപ്പര്‍മാര്‍ക്കറ്റുകളെ ലക്ഷ്യമിട്ടുള്ള സൈബര്‍ ആക്രമണത്തിന് പിന്നിലെന്ത്?

സൂപ്പര്‍മാര്‍ക്കറ്റിലെ ഫ്രീസറുകള്‍ പണിമുടക്കിയാല്‍ ഭക്ഷ്യവസ്തുക്കള്‍ കേടാകാം. എന്നാല്‍ ആ ഫ്രീസറുകളുടെ താപനില...

மோடியை நேரடி விவாதத்திற்கு அழைக்கும் ராகுல்; "நாடாளுமன்றமே சரியான இடம்" – நிர்மலா சீதாராமன் பதில்

சர்தார் வல்லபாய் படேலின் பிறந்தநாளையொட்டி, தேசிய ஒற்றுமை தினத்தில் குஜராத்தில் உரையாற்றிய...

നേഹ ബോറ ഹിന്ദു വിരുദ്ധ; പ്രചോദനം ഉള്‍കൊള്ളുന്നത് രാഹുല്‍ ഗാന്ധിയില്‍ നിന്ന്: ബി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: ഓള്‍ ഇന്ത്യ സ്റ്റുഡന്‍സ് അസോസിയേഷന്‍ പ്രസിഡന്റ് നേഹ ബോറയ്‌ക്കെതിരെ രൂക്ഷ...

பெரிய குரும்பத்தெரு: தொடர் போராட்டம்; சுட்டிக்காட்டிய விகடன்; டாஸ்மாக்கை அகற்றிய மாவட்ட நிர்வாகம்!

சொன்ன வாக்குறுதிகள் நிறைவேறவில்லை... கொடுத்த மனுக்களுக்கும் தீர்வு கிடைக்கவில்லை... ஆனால், தங்களின்...