1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..

Date:

హైదరాబాద్ మహానగరంలో యువతుల ఆర్థిక ఇబ్బందులు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సాగిస్తున్న అక్రమ అండాల సేకరణ , సరఫరా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) తో పాటు బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులు జరిపిన సంయుక్త దాడుల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో ఒక మహిళా హాస్టల్ ముసుగులో, అలాగే సరూర్‌నగర్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి ప్రధాన సూత్రధారి దుర్గాప్రసాద్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

వివిధ గ్రామీణ ప్రాంతాలతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు లేదా ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన యువతులను ఈ మాఫియా టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది. పేదరికంలో ఉన్న యువతులకు ఆశ చూపి, మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తూ, ఒక్కో యువతికి రూ.30,000 వరకు చెల్లించి అండాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో యువతుల ఆరోగ్య భద్రతను పక్కనపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ ఈ దందాను నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ దాడుల సమయంలో సుమారు 30 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని రక్షించారు. ఇలా సేకరించిన అండాలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్పొరేట్ ఐవీఎఫ్ (IVF) కేంద్రాలతో పాటు ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లోని ఫెర్టిలిటీ క్లినిక్‌లకు భారీ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం నిందితుడు దుర్గాప్రసాద్‌ను విచారిస్తున్న పోలీసులు, ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఏయే ప్రముఖ ఆసుపత్రులు , ఫెర్టిలిటీ సెంటర్లు వీరితో చేతులు కలిపాయనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ హార్మోన్ల వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കാലടി സര്‍വകലാശാലയിലെ സമരം; വിദ്യാര്‍ത്ഥികളെ പരീക്ഷയെഴുതിക്കില്ലെന്ന നിലപാടിനെതിരെ നിരാഹാര സമരം ആഹ്വാനം ചെയ്ത് എസ്.എഫ്.ഐ

എറണാകുളം: കാലടി സര്‍വകലാശാലയില്‍ സമരം ചെയ്ത വിദ്യാര്‍ത്ഥികളെ പരീക്ഷയെഴുതാന്‍ അനുവദിക്കണമെന്ന് കോടതി...

"அன்பில் கைதுக்கு காரணமானவரோடு தருமபுரி எம்.பி காட்டும் நெருக்கம்!" – கொந்தளிக்கும் திமுக-வினர்!

   "தி.மு.க ஆட்சிக்கு களங்கத்தை ஏற்படுத்தும் வகையில் புகார் கொடுத்தவரின் நிறுவனம்...

ഇന്ത്യ മുന്നണി റാലിക്കിടെ ദല്‍ഹിയിലെ കടകള്‍ ബി.ജെ.പി ബലം പ്രയോഗിച്ച് അടപ്പിക്കുന്നു: രാഹുല്‍ ഗാന്ധി

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെ പുറത്താക്കാനും എസ്.ഐ.ആര്‍ നടപടികള്‍...

புதுக்கோட்டை: 6 மாதம் கிடப்பில்; சி.எம் விசிட்டால் 2 நாளில் அவசரமாக சாலை பணி; கேள்விக்குறியான தரம்!

தமிழ்நாடு முதலமைச்சர் சி. ஜோசப் விஜய்யின் புதுக்கோட்டை வருகை காரணமாக  கடந்த...