30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?

Date:

AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పుడు ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.

ఎంపీటీసీ ఎన్నికల ముఖ్యాంశాలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో 1,985 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,844 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం మొత్తం 18,952 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక, పార్టీల వారీగా చూస్తే, వైఎస్సార్‌సీపీ నుంచి అత్యధికంగా 7,632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి 6,423 మంది, జనసేన పార్టీ (JSP) నుంచి 1,521 మంది పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా 2,239 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌ (INC) నుంచి 326 మంది, బీజేపీ నుంచి 285 మంది, సీపీఐ(ఎం) నుంచి 259 మంది, బీఎస్పీ నుంచి 133 మంది, ఇతర పార్టీల నుంచి 131 మంది పోటీలో ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.

జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,169 మంది అభ్యర్థులు

జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం మొత్తం 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. వైఎస్సార్‌సీపీ నుంచి 574 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు 503 మంది బరిలో ఉండగా, టీడీపీ నుంచి 452 మంది పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి 270 మంది, జనసేన నుంచి 109 మంది, బీఎస్పీ నుంచి 107 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఇతర పార్టీల నుంచి 64 మంది, సీపీఐ(ఎం) నుంచి 47 మంది, బీజేపీ నుంచి 34 మంది, ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పల్నాడు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అత్యధిక ఏకగ్రీవాలు

జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలను పరిశీలిస్తే పల్నాడు జిల్లా ముందంజలో ఉంది. ఈ జిల్లాలో అత్యధికంగా 382 ఎంపీటీసీ స్థానాలు, 18 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ 358 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం కనిపిస్తోంది. మొత్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీతో పాటు జనసేన, కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా గణనీయమైన సంఖ్యలో బరిలో ఉండటంతో స్థానిక స్థాయిలో పోటీ ఆసక్తికరంగా మారింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നോര്‍ക്ക കെയര്‍ പ്രീമിയം വര്‍ധനവ് പ്രവാസികള്‍ക്ക് കടുത്ത ആഘാതം; പുതിയ നിരക്കുകള്‍ പിന്‍വലിക്കണമെന്ന് പ്രവാസി ലീഗല്‍ സെല്‍

തിരുവനന്തപുരം: നോര്‍ക്ക കെയര്‍ 2026-27 പദ്ധതിയില്‍ പുതുതായി ഏര്‍പ്പെടുത്തിയ പ്രായാധിഷ്ഠിത പ്രീമിയം...

TNPSC தேர்வுக்கு வயது வரம்பு 5 ஆண்டுகள் உயர்வு… அதிரடி அறிவிப்பை வெளியிட்ட முதல்வர் விஜய்

அரசுப் பணிகளில் நேரடி நியமனத்திற்கான வயது உச்ச வரம்பை உயர்த்த முதல்வர்...

UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..

UP News: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది....

‘സ്കൂൾ ബച്ചാവോ’ പ്രക്ഷോഭം വിജയം; മഹാരാഷ്ട്രയിൽ 57 സ്കൂളുകൾ പുനസ്ഥാപിച്ചു; 6,500 വിദ്യാർത്ഥികൾക്ക് ആശ്വാസം

താനെ: സ്റ്റുഡന്റ്സ് ഫെഡറേഷൻ ഓഫ് ഇന്ത്യയുടെ (എസ്.എഫ്.ഐ) നേതൃത്വത്തിൽ നടന്ന ശക്തമായ...