25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!

Date:

Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ‘‘శాంతిభద్రతల బాండ్’’కు సంబంధించిన కేసులో పోలీసులు తమ వాదనలకు ఆధారంగా చూపిన పత్రాలను నేహాబోరా న్యాయవాదికి అందించారు. ఢిల్లీ హైకోర్టు ఆమె పిటిషన్ కొట్టివేసిన మరుసటి రోజు శనివారం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEC) ఎదుట హాజరయ్యారు. ఆమెకు స్పందించడానికి అక్టోబర్ 29 వరకు గడువు ఇచ్చారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ పోలీసులు అక్టోబర్ 17న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 126 కింద నేహా బోరాకు నోటీసు జారీ చేశారు. రూ. 10,000 పూచికత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్ని నేహా బోరా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, నేహాబోరా పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

అక్టోబర్ 16న ఢిల్లీలోని మండీహౌజ్ వద్ద తిరంగా మార్చ్ చేయడం, నినాదాలు చేయడం, జంతర్ మంతర్ వద్ద నినిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ నిరసనలు కొనసాగడం, అదే రోజు కనాట్ ప్లేస్‌లో జరిగే ప్రదర్శనలో పాల్గొనాలని ప్రజలను ప్రోత్సహించారనే ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా అక్టోబర్ 16న నేహా బోరాను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. మరుసటి రోజు ఆమెను విడుదల చేశారు. ప్రస్తుతం నేహా బోరా పోలీసుల పత్రాలను పరిశీలించి అక్టోబర్ 29న సమాధానం ఇవ్వాల్సి ఉంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

റിയാദ് വിമാനത്താവളം ഉപയോഗിക്കരുതെന്ന് യെമനിലെ ഹൂത്തികളുടെ മുന്നറിയിപ്പ്

റിയാദ്: റിയാദിലെ കിങ് ഖാലിദ് അന്താരാഷ്ട്ര വിമാനത്താവളം ഉപയോഗിക്കരുതെന്ന് മുന്നറിയിപ്പുമായി യെമനിലെ...

"புதிதாக ஒரு நடிகரை கட்சி ஆரம்பிக்க வைப்பது RSS-இன் திட்டம்" – என்ன சொல்கிறார் மாணிக்கம் தாகூர்?

மதுரை ஆரப்பாளையம் பகுதியில் நடைபெற்ற திருமண நிகழ்ச்சி ஒன்றில் பங்கேற்ற காங்கிரஸ்...

വിദ്യാഭ്യാസ രംഗത്ത് വർഗീയവത്ക്കരണം അനുവദിക്കില്ല; സർവകലാശാലകളിൽ സ്ഥിരം വി.സിമാരെ നിയമിക്കും: റോജി എം. ജോൺ

തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്തെ ഉന്നത വിദ്യാഭ്യാസ മേഖലയിൽ കാലഘട്ടത്തിനനുസൃതമായ സമഗ്ര മാറ്റങ്ങൾ കൊണ്ടുവരുമെന്ന്...

கேரளம்: பீஃப்-க்கு எதிரான வீடியோ; மத வெறுப்பைப் பரப்பிய வட இந்தியா Vlogger; வழக்கு பதிந்த போலீஸ்

வட இந்தியாவைச் சேர்ந்த யூடியூபர் அம்ரித் சிங் டேரன்.இவர் கேரளா பயண...