25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!

Date:

Inter Exams Time Table: ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి/మార్చి – 2027 వార్షిక పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24, 26 తేదీల్లో.. మార్చి 1, 3, 5, 9, 12, 15 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 24న మొదటి రోజు లాంగ్వేజ్ పేపర్-1తో పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 15న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్-1తో ఫస్టియర్ పరీక్షలు ముగుస్తాయి.

సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమై మార్చి 16 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 25న లాంగ్వేజ్ పేపర్-2తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27, మార్చి 2, 4, 8, 11, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించి.. మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్-2తో ముగుస్తాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే పరీక్ష తేదీలు వర్తిస్తాయని బోర్డు వెల్లడించింది. అయితే వొకేషనల్ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను తరువాత విడిగా విడుదల చేయనున్నారు.

ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఇందులో ఆదివారాలు కూడా ఉన్నాయి. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 27న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 29న నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ తాత్కాలికమైనదని. ప్రభుత్వ సెలవుల ఆధారంగా కొన్ని తేదీల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని బోర్డు స్పష్టం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തില്‍ വര്‍ഗീയ വിദ്വേഷത്തിന് സ്ഥാനമില്ല: ഇന്‍ഫ്ലുവന്‍സറുടെ വര്‍ഗീയ പരാമര്‍ശത്തില്‍ മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: വര്‍ഗീയ വിദ്വേഷത്തിന് കേരളത്തില്‍ സ്ഥാനമില്ലെന്നും കേരളം ഒറ്റക്കെട്ടായി അതിനെ നേരിടുമെന്നും...

"அங்குதான் அவரைச் சந்தித்தேன்; நினைவுகள் நிறைந்த உலகம்.."- ராஜீவ் காந்தியுடனான காதல் குறித்து சோனியா

மூத்த காங்கிரஸ் தலைவரும், நாடாளுமன்ற உறுப்பினருமான சோனியா காந்தி ‘Belonging: A...

മെഗാ ഡാം പ്രൊജക്ടിനെതിരെ പ്രതിഷേധം ശക്തമാകുന്നു: അരുണാചലില്‍ സമരക്കാര്‍ക്കുനേരെ പൊലീസ് അതിക്രമം

ഇറ്റാനഗര്‍: അരുണാചല്‍ പ്രദേശിലെ സിയാങ് ജില്ലയില്‍ പ്രഖ്യാപിച്ചിരിക്കുന്ന സിയാങ് അപ്പര്‍ മള്‍ട്ടിപര്‍പ്പസ്...