22
October, 2026

A News 365Times Venture

22
Thursday
October, 2026

A News 365Times Venture

Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.

Date:

Coimbatore Blasts: 1998 కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఐదుగురికి 60 రోజుల పాటు పెరోల్ మంజూరు చేస్తూ తమిళనాడులోని విజయ్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయి. రాజకీయ లబ్ధి కోసం, శిక్షపడిన ఉగ్రవాదుల పట్ల విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని బీజేపీ ఆరోపించింది. వారు చాలా కాలంగా జైలులో గడిపినందుకు, ఇతర నిందితులకు ఇచ్చినట్లే వీరికి కూడా పెరోల్ ఇవ్వడం సాధారణ ప్రక్రియలో భాగమే అని ప్రభుత్వం వాదిస్తోంది.

టీవీకే ఎమ్మెల్యే వీఎంఎస్ ముస్తఫా పెరోల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి విడుదల అవుతున్న వారిలో ఉన్న 46 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు దోషులు – మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అలీ, మోనప్ప అలియాస్ మహమ్మద్ హసన్, మహమ్మద్ అజమ్, నవాబ్ ఖాన్ ఉన్నారు. వ్యక్తిగత పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల్ని పేర్కొంటూ వీరు పెరోల్‌ కోసం అప్లై చేశారు.

19 పేలుళ్లు, 58 మంది మృతి..

1998 ఫిబ్రవరి 14న అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కే అద్వానీ కోయంబత్తూర్‌లోని ఆర్ఎస్ పురం ఎన్నికల సభలో పాల్గొనేందుకు రావాల్సి ఉంది. ఆయన సభకు ముందు నగరంలో మధ్యాహ్నం 4 గంటల సమయంలో వరస బాంబు పేలుళ్లు సంభవించాయి. కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ సహా నగరంలోని పలు ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. పూంపుహార్ టౌన్ హాల్, ఉక్కడం చేపల మార్కెట్, కరుణానిధి నగర్ వంటి ప్రాంతాల్లోనూ పేలుళ్లు జరిగాయి. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో కూడా పేలుళ్లు కొనసాగాయి.

19 బాంబు పేలుళ్లలో 58 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మంది గాయపడ్డారు. సుమారు రూ. 4.37 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. దర్యాప్తులో అల్ ఉమ్మా అనే సంస్థ దాడులకు పాల్పడినట్లు తేలింది. ఈ సంస్థను ఎస్ఏ బాషా ఏర్పాటు చేశారు. 2024లో ఆయన మరణించాడు. ఈ కేసులో 168 మందిని అరెస్ట్ చేయగా, 158 మందికి శిక్ష పడింది. సుమారు 40 మందికి జీవిత ఖైదు విధించారు. ప్రధాన నిందితుడు బాషాకు కూడా యావజ్జీవ శిక్ష పడింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോഷണത്തിനായാണ് തന്നെ വിളിച്ചതെന്ന് അറിയില്ലായിരുന്നു: പെട്ടുപോയതാണെന്ന് കെ.എം.സി.സി കവര്‍ച്ചയില്‍ കീഴടങ്ങിയ ബി.ജെ.പി നേതാവ്

കോഴിക്കോട്: ജോലി വാഗ്ദാനം ചെയ്താണ് തന്നെ കൊണ്ടുപോയതെന്നും മോഷണമാണ് ഉദ്ദേശമെന്ന് അറിയില്ലായിരുന്നു...

“ஒன்றிய அரசின் உத்தரவுக்கு முதல்வர் விஜய் அடிபணிந்துள்ளது, மிகப்பெரிய தலைகுனிவு" – சீமான்

தமிழ்நாட்டின் இருமொழிக் கொள்கைக்கு மாறாக காவல்துறை கொடி நாள் பேட்ஜில் தமிழைத்...

കേരളത്തില്‍ ജയിച്ചപ്പോള്‍ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍ നല്ലതായിരുന്നു, കോണ്‍ഗ്രസിന്റെ രാഷ്ട്രീയത്തിന് 30 വര്‍ഷത്തേക്കെങ്കിലും ഭരണത്തില്‍ വരില്ല: അമിത് ഷാ

ന്യൂദല്‍ഹി: കോണ്‍ഗ്രസ് പിന്തുടരുന്ന നെഗറ്റിവ് പൊളിറ്റിക്‌സ് വെച്ച് അടുത്ത മുപ്പത് വര്‍ഷത്തേക്കെങ്കിലും...

காணாமல் போன சிறுமி; "டம்மி ஆட்சியில் பச்சை குழந்தைகளுக்குக்கூட பாதுகாப்பில்லை" – உதயநிதி கண்டனம்

விழுப்புரம் மாவட்டம், செஞ்சி அருகே ஆலம்பூண்டி கிராமத்தைச் சேர்ந்த 7 வயது...