14
October, 2026

A News 365Times Venture

14
Wednesday
October, 2026

A News 365Times Venture

EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..

Date:

EV Car Fire Accident: ప్రమాదంలో చిక్కుకున్న ఈవీ కారు.. పూర్తిగా దగ్ధం కావడంతో నలుగురు మృతి చెందారు.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ కారు) పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవదహనం అయ్యారు..  మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం తర్వాత పూర్తిగా దగ్ధమైన కారు
నంబూరులో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ వెస్ట్ బైపాస్‌పై కారు ప్రమాదానికి గురైన అనంతరం కారులో బ్యాటరీ పేలి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నున్న, నంబూరు ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.. నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి కొమ్మారెడ్డి అరుణ, మరో చిన్నారి, నంబూరుకు చెందిన తిగురు విజయ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

సంఘటనా స్థలంలో బంధువుల రోదనలు
ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటివరకు తమతో ఉన్నవారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం ఎలా జరిగింది, కారు మంటల్లో చిక్కుకోవడానికి గల కారణాలేమిటనే అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മകന്റെ ജീവനെടുത്ത ക്രൂരമര്‍ദനം; മറ്റൊരു മകന്‍ ജയിലില്‍: പൊലീസിനെതിരെ പിതാവിന്റെ ഫേസ്ബുക്ക് പോസ്റ്റ്

കൊടുങ്ങല്ലൂര്‍: കള്ളക്കേസില്‍കുടുങ്ങുകയും പൊലീസ് കസ്റ്റഡിയില്‍ ക്രൂരമര്‍ദനത്തിനിരയാവുകയും ചെയ്തതിനെത്തുടര്‍ന്ന് മാനസിക സമ്മര്‍ദത്തിലായിരുന്ന മകന്‍...

"கூலி வேலைக்கு வர்றவனோட உசுருக்கு மதிப்பு கிடையாதா?" – முதல்வரின் பெரம்பூர் தொகுதியில் நடந்த கொடூரம்

நேற்று முதல்வர் விஜய்யின் பெரம்பூர் தொகுதியின் கொடுங்கையூர் பகுதியில் மழைநீர் வடிகால்...

ജേണോ മിററിന്റെയും മൊളിറ്റിക്‌സ് ഇന്ത്യയുടെയും ഇന്‍സ്റ്റാ അക്കൗണ്ടുകള്‍ക്ക് നിയന്ത്രണം

ന്യൂദല്‍ഹി: സ്വതന്ത്ര ഡിജിറ്റല്‍ വാര്‍ത്താ മാധ്യമങ്ങളായ ജേണോ മിറര്‍, മൊളിറ്റിക്‌സ് ഇന്ത്യ...

Vijay: முதல்வர் விஜய்க்கு ஆந்திராவில் உற்சாக வரவேற்பு; இரு மாநில முதல்வர்களும் பேசிக்கொண்டது என்ன?

தமிழ்நாடு முதலமைச்சர் ஜோசப் விஜய் இன்று (அக்-13) ஆந்திரப் பிரதேசத்திற்கு அரசு...