13
October, 2026

A News 365Times Venture

13
Tuesday
October, 2026

A News 365Times Venture

Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..

Date:

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికగా మారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో చెలరేగిపోతూ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న అరుదైన ప్రపంచ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును అభిషేక్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2026లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ ఈ మైలురాయిని అందుకోవడానికి అవసరమైన సిక్సర్లు బాది, 2022లో సూర్యకుమార్ యాదవ్ సాధించిన 68 సిక్సర్ల రికార్డును సమం చేశాడు. కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే కాకుండా, ఓవరాల్ టీ20 క్రికెట్‌లోనూ ఈ ఏడాది అభిషేక్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు.

మరో వైపు.. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 2,000 పరుగుల మైలురాయిని విజయవంతంగా దాటేశాడు. క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. టి20 ఫార్మాట్‌లో 195కు పైగా స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడుతున్న అతను, ఓపెనర్‌గానే ఏకంగా 1,950కి పైగా పరుగులు సాధించడం గమనార్హం. అంతేకాకుండా.. భారతదేశం తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత మూడో స్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗസ ഡോക്യുമെന്ററിയില്‍ മൊഴി നല്‍കിയവര്‍ക്കെതിരെ അന്വേഷണം വേണം: ബെഞ്ചമിന്‍ നെതന്യാഹു

ടെല്‍ അവീവ്: ഗസയില്‍ ഇസ്രഈല്‍ സൈന്യം എ.ഐ ബുദ്ധി ഉപയോഗിച്ച് സാധാരണക്കാരെ...

SIR: "விஜய் ஏன் போராட்டத்தில் பங்கேற்கவில்லை? சொரணை இருந்தால் கேளுங்கள்"- காங்கிரஸுக்கு திமுக பதில்!

தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் தலைமையில் நடந்த எஸ்.ஐ.ஆர் விவகாரம் நாடுமுழுவதும்...

ജനാധിപത്യത്തിന് നേരെയുള്ള നവ-ഫാസിസ്റ്റ് ആക്രമണത്തെ അപലപിക്കുന്നു: ഐക്യദാര്‍ഢ്യവുമായി ബ്രിട്ടീഷ് കമ്മ്യൂണിസ്റ്റ് പാര്‍ട്ടി

ലണ്ടന്‍: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് നടക്കുന്ന...

“தலைமைச் செயலகத்தில் மின்வெட்டுக்கு காரணம் இதுதான்" – மின்வாரியம் விளக்கம்

தவெக அரசு ஆட்சி அமைத்ததிலிருந்து தொடர்ந்து மின்வெட்டு பிரச்னைகள் நீடிக்கின்றன. ஆரம்பத்தில்...