10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..

Date:

దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పరిస్థితులకు అనుగుణంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు. న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలోని ప్రధాన రహదారులతో పాటు మొత్తం 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

శంకర్ రోడ్–వందేమాతరం ‘టీ’ పాయింట్ నుంచి న్యూఢిల్లీ వైపు, ధౌలా కువాన్ ఫ్లైఓవర్, ఝండేవాలన్, పంచకుయాన్, మండీ హౌస్, డాక్టర్ దినేష్ నందిని దాల్మియా చౌక్ (డబ్ల్యూ పాయింట్), రామ్ చరణ్ అగర్వాల్ చౌక్ (ఏ పాయింట్), మింటో రోడ్–దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్, గురు నానక్ చౌక్, చెమ్స్‌ఫోర్డ్ రోడ్–కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ టీ పాయింట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

అలాగే భరియోన్ రోడ్–ఎంజీఎం (రింగ్ రోడ్) టీ పాయింట్, లోధీ రోడ్ ఫ్లైఓవర్, నీలా గుంబద్ రౌండబౌట్, మదర్సా టీ పాయింట్, సమ్రాట్ హోటల్ రౌండబౌట్, సర్దార్ పటేల్ మార్గ్–పంచశీల్ మార్గ్ కూడలి, భికాజీ కామా ప్లేస్ అండర్‌పాస్, మోతీ బాగ్ ఫ్లైఓవర్ కింద, రింగ్ రోడ్–శాన్ మార్టిన్ మార్గ్ టీ పాయింట్ వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడవచ్చు.

అశోకా రోడ్–జంతర్ మంతర్ రోడ్ రౌండబౌట్, విండ్సర్ ప్యాలెస్ రౌండబౌట్, టాల్‌స్టాయ్ మార్గ్–జన్‌పథ్ కూడలి, రైల్ భవన్ రౌండబౌట్, జైసింగ్ రోడ్–సంసద్ మార్గ్ కూడలి, కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్–బరాఖంబా రోడ్ టీ పాయింట్, గోల్ డాక్ ఖానా రౌండబౌట్, పటేల్ చౌక్ రౌండబౌట్, జైసింగ్ రోడ్–అశోకా రోడ్ టీ పాయింట్, ఆర్ఎంఎల్ ఆసుపత్రి రౌండబౌట్, కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్–సంసద్ మార్గ్ టీ పాయింట్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయనున్నారు.

ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ మీదుగా రైల్వే స్టేషన్లు, ఐఎస్‌బీటీ బస్ టెర్మినళ్లు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి అదనపు సమయం కేటాయించాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపుల్లో మార్పులు చేస్తామని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలను సడలించడం లేదా మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతుందని వెల్లడించారు.

తాజా సమాచారం కోసం సంప్రదించండి

ట్రాఫిక్‌కు సంబంధించిన తాజా సమాచారం, ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర హెచ్చరికల కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్ traffic.delhipolice.gov.inను సందర్శించాలని సూచించారు. ఎక్స్‌ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల్లో @dtptraffic ఖాతాలను అనుసరించాలని తెలిపారు. అత్యవసర సమాచారం కోసం 1095 లేదా 011-25844444 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ദിപ്‌കെ അടക്കമുള്ളവരെ എങ്ങോട്ട് മാറ്റിയെന്നറിയില്ല; പ്രതിഷേധത്തിന് അജിങ്ക്യ ഷിന്‍ഡെ നേതൃത്വം നല്‍കും

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് ദല്‍ഹി...

Delhi Protest: அபிஜித் தீப்கேவின் பாட்டி காலமாகிவிட்டாரா? டெல்லி காவல்துறை சொல்வது என்ன?

இந்தியத் தேர்தல் ஆணையத்தின் தலைமைத் தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் பதவி...

ജയില്‍ പോലെയുള്ള വാഹനം; മര്യാദയില്ലാതെ പൊലീസ് പെരുമാറുന്നു: ദല്‍ഹിയില്‍ കസ്റ്റഡിയിലായ സി.പി.ഐ.എം നേതാക്കള്‍

ദല്‍ഹി: തങ്ങളോട് പൊലീസ് മര്യാദയില്ലാതെയാണ് പെരുമാറുന്നതെന്നും എന്താണ് തങ്ങള്‍ ചെയ്ത കുറ്റമെന്നും...

"தோற்றுப்போனவர்கள் ஏதாவது ஒரு விளக்கத்தைச் சொல்லத்தானே வேண்டும்" – இபிஎஸ்ஸுக்கு வைகோ பதில்

நடந்து முடிந்திருக்கும் இடைத்தேர்தலில் மதுராந்தகம், தாராபுரம் தொகுதியில் முதல்வர் விஜய்யின் தவெக...