10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..

Date:

Amit Shah: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. రాజస్థాన్, త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన విజయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. ఈ ఫలితాలు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబంబిస్తుందని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో విజయాల తర్వాత అమిత్ షా ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు, అబద్ధాలు, గందరగోళం, దుష్ప్రచారం మధ్య కూడా మోడీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని, బీజేపీ వరసగా ఎన్నికల్లో విజయం సాధిస్తోందని అన్నారు. ఇండియా కూటమిని తిరస్కరించడానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. ప్రజల్లో తమ మద్దతు కోల్పోయిన విపక్ష పార్టీలు ప్రతీ ఓటమి తర్వాత ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయని విమర్శించారు. విపక్షాల వైఖరిని ప్రజలు గుర్తించారని, అందకే మరోసారి బీజేపీకి భారీ మెజారిటీతో మద్దతు తెలిపారని అన్నారు. ఈ విజయాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, త్రిపుర ముఖ్యమంత్రులతో పాటు పుదుచ్చేరి నాయకులకు, ఆయా రాష్ట్రాల పార్టీ నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ജയില്‍ പോലെയുള്ള വാഹനം; മര്യാദയില്ലാതെ പൊലീസ് പെരുമാറുന്നു: ദല്‍ഹിയില്‍ കസ്റ്റഡിയിലായ സി.പി.ഐ.എം നേതാക്കള്‍

ദല്‍ഹി: തങ്ങളോട് പൊലീസ് മര്യാദയില്ലാതെയാണ് പെരുമാറുന്നതെന്നും എന്താണ് തങ്ങള്‍ ചെയ്ത കുറ്റമെന്നും...

"தோற்றுப்போனவர்கள் ஏதாவது ஒரு விளக்கத்தைச் சொல்லத்தானே வேண்டும்" – இபிஎஸ்ஸுக்கு வைகோ பதில்

நடந்து முடிந்திருக்கும் இடைத்தேர்தலில் மதுராந்தகம், தாராபுரம் தொகுதியில் முதல்வர் விஜய்யின் தவெக...

ജന്തര്‍ മന്തര്‍ പ്രതിഷേധം: ധ്രുവ് റാഠി കസ്റ്റഡിയില്‍; വിദ്യാര്‍ത്ഥികളെയും യുവാക്കളെയും ദല്‍ഹി പൊലീസ് കസ്റ്റഡിയിലെടുക്കുന്നു

ന്യൂദല്‍ഹി: മുഖ്യതെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് ഇന്ന് നടക്കാനിരിക്കുന്ന...