6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే

Date:

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రానికి ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రత్యేక రైలు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీ సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం, దేవాదాయ, భాషా-సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 18 బోగీలతో కూడిన ప్రత్యేక ఎఫ్‌‌టీఆర్ రైలును వేరావల్‌కు పంపించారు.

ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 ప్రముఖ దేవాలయాల నుంచి ఎంపిక చేసిన 1,060 మంది భక్తులు ఈ యాత్రలో ఉచితంగా పాల్గొంటున్నారు. శ్రీశైలం, తిరుమల, ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి వివిధ ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి భక్తులు ఈ ప్రత్యేక రైలు ద్వారా తరలివెళ్లారు. వీరితో పాటు రాష్ట్ర సంస్కృతి, కళారూపాలను ప్రదర్శించేందుకు 100 మందితో కూడిన సాంస్కృతిక బృందం కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటోంది.

భక్తుల సౌకర్యం కోసం రైలులో భోజనం, వసతి, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రతి బోగీకి ప్రత్యేక పర్యవేక్షకులను, ప్రతి 22 మంది భక్తులకు ఒక గ్రూప్ లీడర్‌ను నియమించారు. గుజరాత్‌‌లో రెండు రోజుల పాటు భక్తులకు స్థానిక రవాణా, వసతి, ప్రసిద్ధ క్షేత్రాల దర్శన ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం సమకూరుస్తోంది. జాతి సమగ్రతను, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ చారిత్రక యాత్రలో పాల్గొనడం అదృష్టమని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ, సాంస్కృతిక, రైల్వే శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

MYSORE PALACE: ನಟಿ ಕಾಜಲ್ ಅಗರ್ವಾಲ್ ಭೇಟಿ; ಅರಮನೆ ವೈಭವಕ್ಕೆ ಮನಸೋತ ನಟಿ

  ಮೈಸೂರು, ಅ.5: ದಕ್ಷಿಣ ಭಾರತದ ಖ್ಯಾತ ಚಿತ್ರನಟಿ ಕಾಜಲ್ ಅಗರ್ವಾಲ್...

‘വോട്ട് ബച്ചാവോ ദേശ് ബച്ചാവോ’; ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ കോണ്‍ഗ്രസിന്റെ രാജ്യവ്യാപക പ്രക്ഷോഭം ഒക്ടോബര്‍ 10 മുതല്‍

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ പ്രതിഷേധം ശക്തമാക്കി കോണ്‍ഗ്രസ്....

“முதல்வர் விஜய் சென்ற மாட்டுவண்டியை ஓட்டிச் சென்றவர் யார்?" – ஆர்.எஸ்.பாரதி கேள்வி

திமுக தலைவர் மு.க.ஸ்டாலின், எதிர்க்கட்சித் தலைவர் உதயநிதி ஸ்டாலின் ஆகியோர் மீது...

ಧರ್ಮ ಮತ್ತು ಜಾತಿ ಈ ದೇಶದ ದುರಂತ: ಕಫೀಲ್ ಖಾನ್

  Bangalore, oct.05,2026: ಧರ್ಮ ಮತ್ತು ಜಾತಿ ಈ ದೇಶವನ್ನು ನುಂಗಿಹಾಕುತ್ತಿದೆ...