28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..

Date:

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా ‘NPS స్వాస్థ్య’ పేరుతో ఓ వినూత్న పథకం అందుబాటులోకి రానుంది. రిటైర్మెంట్ కోసం డబ్బును దాచుకోవడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కొత్త పథకంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మొదటిది ప్రత్యేక పెట్టుబడి ఖాతా కాగా, రెండోది దీనికి జతగా ఉండే అనివార్యమైన సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ ఇన్సూరెన్స్ ద్వారా వైద్య ఖర్చులను కవర్ చేసుకోవచ్చు. అలాగే తమ ఆరోగ్య అవసరాల కోసం ఎన్‌పీఎస్ స్వాస్థ్య కార్పస్ నుంచి పాక్షిక ఉపసంహరణలు కూడా చేసుకోవచ్చు.

NPSలో చేరే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొత్త పథకంలో చేరవచ్చు. ఇందులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కూడిన ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజ్ లభిస్తుంది కానీ తల్లిదండ్రులకు ఈ అవకాశం ఉండదు. ఈ పాలసీలో చేరేందుకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 70 ఏళ్లుగా ఉంది. నిబంధనల ప్రకారం 85 ఏళ్ల వరకు దీనిని రెన్యూవల్ చేసుకోవచ్చు. ప్రారంభంలో చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ మూడు భాగాలుగా ఉంటుంది. ఇందులో మొదటి ఏడాది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్యాక్సులు, రూ. 200 వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ, అలాగే ఎన్‌పీఎస్ స్వాస్థ్య పెట్టుబడి ఖాతాలో కనీసం రూ. 1,000 జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కనీస పెట్టుబడి కేవలం రూ. 10 మాత్రమే ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం వయసు ఆధారంగా బీమా సంస్థ ద్వారా మారుతుంది.

ఈ పాలసీలో భాగంగా నాలుగు రకాల డిడెక్టిబుల్, సమ్-ఇన్ష్యూర్డ్ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 10,000 డిడెక్టిబుల్‌కు రూ. 1 లక్ష కవర్, రూ. 50,000 డిడెక్టిబుల్‌కు రూ. 5 లక్షల కవర్, రూ. 1 లక్ష డిడెక్టిబుల్‌కు రూ. 10 లక్షల కవర్, రూ. 3 లక్షల డిడెక్టిబుల్‌కు రూ. 30 లక్షల కవర్ లభిస్తాయి. డిడెక్టిబుల్ అంటే బీమా వర్తించడానికి ముందు కస్టమర్ స్వయంగా చెల్లించాల్సిన ప్రారంభ మొత్తం. ఒకవేళ వైద్య ఖర్చులు వస్తే తమ ఎన్‌పీఎస్ స్వాస్థ్య ఖాతా నుంచి పాక్షిక విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఉపసంహరణ పరిమితి ఖాతాదారుడి మొత్తం కాంట్రిబ్యూషన్‌లో 25 శాతానికి మాత్రమే పరిమితం చేయబడింది. ఈ విత్‌డ్రాయల్స్‌కు ఎలాంటి సంఖ్యాపరమైన పరిమితులు లేదా వెయిటింగ్ పీరియడ్ ఉండదు. అయితే ఈ డబ్బు నేరుగా కస్టమర్‌కు కాకుండా ఆసుపత్రికి లేదా అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ సంస్థకు నేరుగా చెల్లించబడుతుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೌಢ್ಯ ವಿರೋಧಿ ಕಾಯ್ದೆ ಜಾರಿಗೆ ಪಟ್ಟಭದ್ರ ಹಿತಾಸಕ್ತಿಗಳಿಂದ ಅಡ್ಡಿ: ಸಿದ್ದರಾಮಯ್ಯ

  ಮೈಸೂರು, ಸೆ.27, 2026: ಸಮಾಜದಲ್ಲಿ ಮೌಢ್ಯ, ಕಂದಾಚಾರ ಹಾಗೂ ಅವೈಜ್ಞಾನಿಕ...

ചോദ്യത്തിന് മറുപടിയില്ല; പകരം കഴുത്തറുക്കല്‍ ആംഗ്യം: അഫ്ഗാന്‍ വനിതാ മാധ്യമപ്രവര്‍ത്തകയോട് പാക് പ്രതിരോധമന്ത്രി

ന്യൂയോര്‍ക്ക്: അഫ്ഗാന്‍ വനിതകളോടുള്ള താലിബാന്‍ നയത്തെക്കുറിച്ച് ചോദിച്ച മാധ്യമ പ്രവര്‍ത്തകയോട് കഴുത്തറുക്കുന്നതിന്...

RTI-ல் சட்டம் – ஒழுங்கு நீக்கம் குறித்த அறிவிப்பு – திரும்பப் பெற்றது தமிழ்நாடு அரசு!

தமிழ்நாட்டில் தகவல் அறியும் உரிமைச் சட்டத்தின் கீழ் சட்டம் ஒழுங்கு குறித்து...

IND Vs WI: భారీ స్కోర్ సాధించిన వెస్టిండీస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..

భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి...