27
September, 2026

A News 365Times Venture

27
Sunday
September, 2026

A News 365Times Venture

OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?

Date:

OTR:  పార్టీ పవర్‌లో లేకపోతే మాకేంటి? అధిష్టానం నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే ఏంటి? మా రూటే సపరేటు. పార్టీ ప్రయోజనాలతో పనిలేదు. మా ఇగోలే మాకు ముఖ్యమని అంటున్నారట అక్కడి గులాబీ లీడర్స్‌. ప్రోగ్రామ్‌ ఏదైనాసరే… ఎడముఖం పెడ ముఖమే తప్ప కలిసే ప్రసక్తే లేదంటున్నారు? ఏ ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో ఉందా వాతావరణం? అక్కడి ప్రత్యేక పరిస్థితులేంటి?. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… బీఆర్ఎస్ సమన్వయ లోపంతో సతమతం అవుతోంది. పార్టీ నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారట. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు అధిష్టానం పిలుపునిస్తే…ఎవరికి వారేనని అంటున్నారు తప్ప ఉమ్మడి కార్యాచరణ మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మూడు గ్రూపులు కూడా ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని పార్టీ వర్గాలే అంటున్నాయి.

అధికారంలో లేకున్నాసరే… కార్యక్రమాల్లో ఒకర్ని ఒకరు నెట్టుకుంటూ, తోసుకునే స్థాయికి విభేదాలు చేరుకున్నట్టు చెబుతున్నారు. ఇక బహిరంగ విమర్శలు, ఘర్షణలు సర్వ సాధారణమైపోయాయని అంటున్నారు. వైరా, అశ్వారావు పేట, ఇల్లందు నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉందని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం ఏ పిలుపునిచ్చినా… మేం కలవంగాక కలవబోమని అంటున్నారట ఇక్కడి నాయకులు. వైరా నియోజకవర్గంలో మూడు వర్గాలుగా ఉంది బీఆర్‌ఎస్‌. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూతురు మనీషాది ఒక వర్గం, మాజీ ఎమ్మెల్యే చంద్రావతిది మరో వర్గం కాగా… కొత్తగా గిరిబాబు వర్గం కూడా తయారైందట. ఇలా ఎవరికి వారు ఆధిపత్యం కోసం పాకులాడుతుండటంతో… పార్టీ కునారిల్లుతోందన్నది కేడర్‌ అభిప్రాయం. వర్గపోరుతో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో సైతం తోపులాటలు పెరుగుతున్నాయి.

ఇక అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇక్కడ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఇద్దరూ వేర్వేరుగా చేస్తుంటారు. గతంలో టీడీపీ తరపున ఒకసారి, వైసీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు తాటి వెంకటేశ్వరరావు. అలాగే మెచ్చా నాగేశ్వరరావు కూడా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ… ఇప్పుడు ఇద్దరూ అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులే. అటు పార్టీ అధిష్టానం కూడా ఇద్దర్నీ ప్రోత్సహిస్తోందట. ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ చెరో వర్గంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా వేరువేరుగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పరిపాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో సైతం ఎవరి దారి వారిదే. ఈ వర్గ విభేదాలు కార్యకర్తల్లో గందరగోళం పెంచుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరి ప్రియ తరువాత బీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారామె.అయితే ఆమెకు మొదటి నుంచి రాజేందర్‌తో విభేదాలున్నాయి. ఎంతచేసినా… రాజేందర్ ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకుంటే… ఆయన బీసీ. ఇల్లందు ఎస్టీ రిజర్వ్‌ సీటు. అయినా ఇద్దరూ కలిసి పనిచేసే పరిస్థితి లేదు. ఇలా… మూడు నియోజకవర్గాల్లో గులాబీ గుద్దులాటలు తీవ్ర స్థాయికి చేరాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?

Off The Record: ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది....

സി.ജെ.പി നേതാവ് ആശുതോഷ് റങ്ക അസമില്‍ കസ്റ്റഡിയില്‍; മുഖ്യമന്ത്രിയ്ക്ക് ഭയമാണെന്ന് പാര്‍ട്ടി

ഗുവാഹത്തി: കൊക്രോച്ച് ജനതാ പാര്‍ട്ടി കോ-കണ്‍വീനര്‍ ആശുതോഷ് റങ്ക പൊലീസ് കസ്റ്റഡിയില്‍....

கும்பகோணம்: காரை மறித்து தவெக நிர்வாகியை தாக்கிய மர்ம நபர்கள் – நிதி நிறுவன தேர்தல் காரணமா..?

தவெக-வின் கும்பகோணம் மாநகரச் செயலாளர் முருகானந்தம். இவர் நேற்று இரவு கோடையான்...

IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..

భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి...