LIC Smart Pension Plan: తర్వాత కూడా ప్రతినెల చేతికి కొంత డబ్బులు వస్తే ఎంత బాగుంటుందో కదా! పైగా ఉద్యోగం లేకపోయినా, ఎవరిమీదా ఆధారపడకుండా సొంతంగా బతికేయొచ్చు. అలాంటి వారి కోసమే దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ (LIC) ఒక సూపర్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ‘ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్’. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అందరికీ రకరకాల పాలసీలు అందించే ఎల్ఐసీ, రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 25,000 వరకు గ్యారెంటీ పెన్షన్ ఇచ్చేలా ఈ ప్లాన్‌ను డిజైన్ చేసింది.
ఈ స్కీమ్ ప్రత్యేకం ఏంటంటే..?
ప్రతి నెలా లేదా ప్రతి సంవత్సరం ప్రీమియంలు కట్టాల్సిన తిప్పలు ఉండవు. ఇది ఒక ‘సింగిల్ ప్రీమియం’ ప్లాన్. అంటే ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీ జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది. మీరు సంపాదించే దాంట్లో కొంత పొదుపు చేసి, మంచి రిటర్న్స్ వచ్చే చోట పెట్టాలనుకున్నా, లేదా రిటైర్మెంట్ లైఫ్‌ను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా గడిపేయాలనుకున్నా ఈ ప్లాన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఎవరైనా సరే ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో సింగిల్ అకౌంట్ తీసుకోవచ్చు, లేదా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు. కనీసం రూ. 1 లక్ష నుంచి ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే, అంత ఎక్కువ పెన్షన్ మీ ఖాతాలో పడుతుంది.
ఏటా 3% నుంచి 6% వరకు పెంచుకునే ఆప్షన్
ఇదొక ‘ఇమ్మీడియట్ యాన్యుటీ’ ప్లాన్, పైగా షేర్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం లేని స్కీమ్. కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మీ పెన్షన్ సేఫ్‌గా ఉంటుంది. ఒకవేళ అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే, ప్లాన్ తీసుకున్న 3 నెలల తర్వాత దీనిపై లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అలాగే పెన్షన్ మొత్తాన్ని ప్రతి సంవత్సరం 3% నుంచి 6% వరకు పెంచుకునే ఆప్షన్ కూడా ఎల్ఐసీ ఇస్తోంది. ఒకవేళ పాలసీ దారుడు మరణిస్తే, వారు ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తం తిరిగొచ్చేలా నామినీకి ఇచ్చేస్తారు. అవసరమైతే పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ డబ్బులు వెనక్కి తీసుకునే సదుపాయం కూడా ఉంది.
రూ.25 వేల పెన్షన్ ఎలా వస్తుందంటే..?
నెలకు రూ. 25,000 పెన్షన్ ఎలా వస్తుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. 60 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ఈ ప్లాన్‌లో రూ. 32 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టారనుకుందాం. అప్పుడు ఆయనకు సంవత్సరానికి రూ. 3,01,056 పెన్షన్ వస్తుంది. దీన్ని నెలవారీగా చూసుకుంటే.. నెలకు సుమారు రూ. 25,088 చొప్పున ఆయన బతికి ఉన్నంత కాలం ఖాతాలో పడుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కువ పెన్షన్ కావాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని పెంచుకుంటే సరిపోతుంది. ఈ పెన్షన్‌ను మీ వీలును బట్టి నెలకు ఒకసారా, మూడు నెలలకా, ఆరు నెలలకా లేక సంవత్సరానికి ఒకసారా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మన దేశ పౌరులు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో గానీ, లేదా ఎల్ఐసీ ఏజెంట్లు, POSP-లైఫ్ ఇన్సూరెన్స్, కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా ఆఫ్‌లైన్‌లో గానీ ఈ పాలసీని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రిటైర్మెంట్ తర్వాత లైఫ్‌ను ఎలాంటి టెన్షన్లు లేకుండా రాయల్‌గా గడిపేయొచ్చు!





