17
September, 2026

A News 365Times Venture

17
Thursday
September, 2026

A News 365Times Venture

SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..

Date:

ప్రస్తుత కాలంలో మొబైల్ నంబర్ కేవలం కాల్స్, మెసేజ్‌లకే కాకుండా బ్యాంకు ఖాతాలు, యూపీఐ, సోషల్ మీడియా వంటి అనేక ఆన్‌లైన్ సేవలతో అనుసంధానించబడి ఉంటుంది. ఒకవేళ మీ సిమ్ కార్డ్ వేరే వారి చేతికి చిక్కినా లేదా ఎవరైనా దుర్వినియోగం చేసినా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులలో సిమ్ లాక్ ఫీచర్ భద్రతకు అదనపు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

సిమ్ లాక్ అనేది ఫోన్‌లో లభించే ఒక ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్. దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత సిమ్‌ను వేరే ఫోన్‌లో మార్చినా లేదా ఫోన్ రీస్టార్ట్ చేసినా పిన్ నంబర్ అడుగుతుంది. సరైన పిన్ ఎంటర్ చేయకపోతే ఆ సిమ్‌ను ఎవరూ ఉపయోగించలేరు. దీనివల్ల ఫోన్ లేదా సిమ్ పోయినప్పటికీ మీ నంబర్‌ను ఇతరులు సులభంగా వాడకుండా నిరోధించవచ్చు.

స్క్రీన్ లాక్, సిమ్ లాక్ రెండూ వేర్వేరుగా ఉంటాయి. స్క్రీన్ లాక్ ద్వారా మొత్తం ఫోన్ సురక్షితంగా ఉంటే, సిమ్ లాక్ ప్రత్యేకంగా సిమ్ కార్డ్‌ను మాత్రమే రక్షిస్తుంది. కాబట్టి మెరుగైన భద్రత కోసం ఈ రెండు ఫీచర్లను ఉపయోగించడం మంచిది. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ లేదా ప్రైవసీ ఆప్షన్ల ద్వారా సిమ్ లాక్ సెట్ చేసుకోవచ్చు. ఐఫోన్లలో అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెల్యులార్ లేదా మొబైల్ సర్వీస్ ద్వారా సిమ్ పిన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. మొదటిసారి లాక్ చేసేటప్పుడు టెలికం ఆపరేటర్ అందించే డిఫాల్ట్ పిన్ అవసరమవుతుంది.

సిమ్ లాక్ ఆన్ చేశాక పిన్‌ను గుర్తుంచుకోవడం ఎంతో ముఖ్యం. పొరపాటున తప్పు పిన్‌ను పదే పదే ఎంటర్ చేస్తే సిమ్ లాక్ అయిపోతుంది. దాన్ని అన్‌లాక్ చేయడానికి పీయూకే కోడ్ అవసరం పడుతుంది. కాబట్టి సరైన అవగాహన లేకుండా ఎక్కువసార్లు తప్పు పిన్ నంబర్లు కొట్టకూడదు.

ఈ సెక్యూరిటీ ఫీచర్ అదనపు రక్షణనిచ్చినప్పటికీ, దీనివల్లే పూర్తిగా సైబర్ మోసాలు ఆగిపోవని గమనించాలి. ఏ వ్యక్తయినా ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. ఒకవేళ మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే మీ టెలికాం ఆపరేటర్ , బ్యాంకు అధికారులకు సమాచారం అందించడం చాలా ముఖ్యం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നരേന്ദ്ര മോദിയുടെ ജന്മദിനം എല്ലാ വര്‍ഷവും അന്നപൂര്‍ണ ദിവസമായി ആചരിക്കും: പ്രഖ്യാപനവുമായി സുവേന്ദു അധികാരി

കൊല്‍ക്കത്ത: പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയുടെ ജന്മദിനമായ സെപ്റ്റംബര്‍ 17ന് പശ്ചിമ ബംഗാളില്‍...

`விவசாயிகள் ஏற்றுமதியாளராக மாற வேண்டும்’ – மாம்பழங்களை மதிப்புக்கூட்ட வேலூர் கலெக்டர் வலியுறுத்தல்

வேலூர் மாவட்டத்தில் சுமார் 5,924 ஹெக்டர் பரப்பளவில் `மா’ பயிர்ச் சாகுபடி...

Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!

Pakistan: పాకిస్తాన్ సైన్యం, అమెరికాకు చెందిన డ్రోన్ కంపెనీ ‘పవరస్’’తో కీలక...

ಮಕ್ಕಳ ಕೆಲಸವೆಂದರೆ ದೇವರ ಕೆಲಸ: ಕಾಲೇಜು ನೂತನ ಕಟ್ಟಡ ಉದ್ಘಾಟಿಸಿದ ಶಿಕ್ಷಣ ಸಚಿವ ಮಧು ಬಂಗಾರಪ್ಪ

ಮೈಸೂರು, ಸೆಪ್ಟಂಬರ್,17,2026 (www.justkannada.in):    ಎಲ್ಲರಿಗೂ ಗುಣಮಟ್ಟದ ಶಿಕ್ಷಣ ದೊರೆಯುವುದು ಅವಶ್ಯ....