15
September, 2026

A News 365Times Venture

15
Tuesday
September, 2026

A News 365Times Venture

Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..

Date:

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓపెనర్ రహ్మానుల్లా గుబాజ్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బాదిన్ నైబ్ (2), దర్విష్ రసూలి (2), రషీద్ ఖాన్ (1), నూర్ అహ్మద్ (0) తీవ్రంగా నిరాశపరిచారు. సెదిఉల్లా అటల్ 13 పరుగులు చేశాడు.

స్కోరు బోర్డు కష్టాల్లో ఉన్న సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుత పోరాటం కనబరిచాడు. ఒమర్జాయ్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా మొహమ్మద్ నబీ 27 బంతుల్లో 33 పరుగులు జోడించగా, చివరిలో ముజీబ్ ఉర్ రెహమాన్ 3 బంతుల్లో 9* పరుగులు చేసి స్కోరును 156కి చేర్చారు.

భారత బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 1 వికెట్ తీయగా, నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లలో కేవలం 3 పరుగులిచ్చి ఆకట్టుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. ఎక్స్‌ట్రాస్ రూపంలో ఆఫ్ఘనిస్తాన్‌కు 21 పరుగులు వచ్చాయి. ఇప్పుడు భారత్ 157 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ದೇಶದ ಜನತೆಗೆ ಗೌರಿ ಗಣೇಶ ಹಬ್ಬದ ಶುಭ ಕೋರಿದ ಪ್ರಧಾನಿ ಮೋದಿ

ನವದೆಹಲಿ,ಸೆಪ್ಟಂಬರ್,14,2026 (www.justkannada.in): ಇಂದು ನಾಡಿನೆಲ್ಲೆಡೆ ಗೌರಿ ಗಣೇಶ ಹಬ್ಬದ ಸಂಭ್ರಮವಾಗಿದ್ದು...

ഇന്ത്യ-ചൈന: പിന്നോട്ട് പോകാതെ ബന്ധം മുന്നോട്ട് കൊണ്ട് പോകേണ്ട സമയമായി; ചൈനീസ് വിദേശ കാര്യമന്ത്രി

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യയും ചൈനയും തമ്മിലുള്ള ബന്ധം മുന്നോട്ട് കൊണ്ടു പോകണമെന്ന് ചൈനീസ്...

'நிகழ்ச்சி தொடர்பாக பேசியதை தவறாக சித்தரிக்க வேண்டாம்!" – பிக்பாஸ் சர்ச்சைக்கு விஜய் டிவி விளக்கம்!

பிக்பாஸ் நிகழ்ச்சியில் நடிகர் விஜய் சேதுபதி பகிர்ந்த கருத்தை முன்வைத்து தவெக...

ಟಿ.ನರಸೀಪುರ ಇನ್ಸ್ ಪೆಕ್ಟರ್ ವಾರ್ನಿಂಗ್ ವಿಚಾರ: ಸಮರ್ಥಿಸಿಕೊಂಡ ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,14,2026 (www.justkannada.in):  ಮಸೀದಿಗಳ ಮುಂದೆ ಗಣೇಶ ಮೂರ್ತಿ ಮೆರವಣಿಗೆ  ಹೋಗದಂತೆ...