9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?

Date:

Ketan Agarwal Murder: పూణేలో సంచలనం సృష్టించి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది. కేతన్‌ను అతడికి కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరిలు కలిసి లోహగఢ్ కోట పైనుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో మూడో వ్యక్తి చేతన్ స్నేహితుడు రితేష్ హింగేని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్‌కు చెందిన రితేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో హత్య పథకం గురించి రితేష్‌కు తెలుసని, చేతన్ తన ప్రణాళికల్ని ఎప్పటికప్పుడు రితేష్‌తో పంచుకున్నట్లు ఎస్పీ సందీప్ సింగ్ గిల్ చెప్పారు.

అయితే, ఈ కేసులో ముందుగా కేతన్‌ను కిరాయి హంతకుడితో హత్య చేయించాలని చేతన్, సియాలు భావించారని, తర్వాత చేతన్, సియాలో హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. దర్యాప్తు సమయంలో రితేష్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. హత్యకు ముందు రితేష్ హత్య జరిగిన లోహగఢ్ కోటను సందర్శించాడా? లేదా ? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కేతన్‌కు తీవ్రమైన గాయం లేదా, శరీరంలో ఏదైనా భాగానికి నష్టం కలిగించేలా ముగ్గురు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఒకవేళ కేతన్‌కు తీవ్ర గాయాలైనా లేదా అతని శరీరంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నా, సియాతో జరగబోయే అతని వివాహాన్ని అడ్డుకోవచ్చని నిందితులు భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు సమయంలో ఈ కుట్రలో రితేష్ కూడా ఉన్నట్లు తేలిందని, దీంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు డిజిటల్ ఆధారాలపై కూడా పనిచేస్తున్నారు. పోలీసుల ప్రకారం, తొలగించబడిన వాట్సాప్ చాట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చాట్‌లు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను ఫోరెన్సిక్ పద్ధతిలో పరిశీలిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి...

ರೈತರ ವಿಮೆ ಹಣ ಕಟ್ಟದ, ಸೊಸೈಟಿ ಕಾರ್ಯದರ್ಶಿ ವಜಾಕ್ಕೆ ಸಿಎಂ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು, ಸೆಪ್ಟಂಬರ್, 08,2026 (www.justkannada.in): ಬೆಳಗಾವಿಯ ಜೇವರ್ಗಿ ತಾಲ್ಲೂಕಿನ ಇಟ್ಟನಹಳ್ಳಿ...

വംശീയ ഉന്മൂലനം ചൂണ്ടിക്കാട്ടിയതിനും അനധികൃത കുടിയേറ്റങ്ങള്‍ക്കെതിരായ ഉപരോധത്തിനും ബ്രിട്ടനെതിരെ പ്രതികാര നടപടികളുമായി ഇസ്രഈല്‍

ലണ്ടന്‍: വെസ്റ്റ് ബാങ്കിലെ അനധികൃത ഇസ്രഈല്‍ കുടിയേറ്റ കേന്ദ്രങ്ങളുമായുള്ള എല്ലാ വ്യാപാരങ്ങള്‍ക്കുമെതിരെ...

முதல் நாளிலேயே களமிறங்கிய திமுக : இடைத்தேர்தலுக்கான வேட்பாளர்கள் யார் யார்?

தமிழகத்தில் 7 சட்டமன்றத் தொகுதிகள் காலியாக இருக்கும் நிலையில் மதுராந்தகம், தாராபுரம்...