8
September, 2026

A News 365Times Venture

8
Tuesday
September, 2026

A News 365Times Venture

Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!

Date:

Germany AfD Election: జర్మనీలో రాజకీయ సంచలనం నమోదైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే నాజీ శకం ముగిసిన తర్వాత, జర్మనీలోని సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో తీవ్ర కుడిపక్ష(ఫార్ రైట్) ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) భారీ విజయాన్ని సాధించింది. సెప్టెంబర్ 6, 2026న జరిగిన లాండ్‌టాగ్ ఎన్నికలలో, AfD 43.8 శాతం ఓట్లతో చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది వారి 2021 ఫలితం (20.8%) కంటే రెట్టింపు కంటే ఎక్కువ. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పార్టీ అయిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (CDU) కేవలం 17.2 శాతం ఓట్లను మాత్రమే పొందింది.

83 మంది సభ్యులున్న సాక్సోనీ-అన్హాల్ట్ అసెంబ్లీలో AfDకి 39 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన 42 సీట్లకు మూడు సీట్లు తక్కువగా నిలిచింది. జర్మనీ ఇంటెలిజెన్స్ సంస్థ ఏఎఫ్‌డీని ఒక అతివాద గ్రూపుగా పేర్కొంది. ఏఎఫ్‌డీ పార్టీ నేత 35 ఏళ్ల ఉల్రిచ్ జిగ్మండ్ ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు మాకు అవకాశాన్ని ఇచ్చారని అన్నారు. అయితే, మిగతా పార్టీలతో పొత్తులు ఉంటేనే ఏఎఫ్‌డీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.

తూర్పు జర్మనీలో ఆర్థికంగా వెనకడిన ప్రాంతాల్లో వలసలు, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ఉన్న వ్యతిరేకత ఏఎఫ్‌డీకి కలిసి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏఎఫ్‌డీతో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ముందుకురావడం లేదు. ఈ విధానాన్నే జర్మన్ రాజకీయాల్లో ‘ఫైర్‌వాల్’గా పిలుస్తారు. అయితే ఈ గెలుపుతో జర్మనీ రాజకీయ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ ఫలితాలు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ నాయకత్వానికి కూడా పెద్ద సవాలుగా మారింది. రాబోయే మెక్లెన్‌బర్గ్-వెస్ట్ పోమెరేనియా, బెర్లిన్ ఎన్నికల్లో AfD ప్రదర్శనపై ఈ ఫలిత ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు జర్మన్ రాజకీయాల్లో కీలకంగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ವಿದ್ಯುತ್ ನಿಗಮಕ್ಕೆ ಆರ್ಥಿಕ ನಷ್ಟ ಆರೋಪ: ನಾಲ್ವರು ಸಿಬ್ಬಂದಿ ಅಮಾನತು

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್,8,2026 (www.justkannada.in):  ಚಾಮುಂಡೇಶ್ವರಿ ವಿದ್ಯುತ್ ಸರಬರಾಜು ನಿಗಮದ (ಚಾವಿಸನಿನಿ) ಎನ್.ಆರ್.ಮೊಹಲ್ಲಾ...

എ.എഫ്.ഡിയുടെ തെരഞ്ഞെടുപ്പ് മുന്നേറ്റം ആശങ്കാകരം; ജര്‍മനി വീണ്ടും തീവ്ര വലതിന്റെ കയ്യിലേക്കെന്ന് യൂറോപ്യന്‍ നേതാക്കള്‍

പാരീസ്: ജര്‍മനിയിലെ സാക്സോണി-അന്‍ഹാള്‍ട്ട് സംസ്ഥാന തെരഞ്ഞെടുപ്പില്‍ തീവ്ര വലതുപക്ഷ പാര്‍ട്ടിയായ ആള്‍ട്ടര്‍നേറ്റീവ്...

"மூன்று கோப்புகள் இருப்பதாக முதல்வர் சொன்னார், ஏன் அதைப் பற்றி பேசவில்லை? சம்மந்தமே.!" – பெ.சண்முகம்

மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியின் மாநில செயலாளர் பெ.சண்முகம் சட்டமன்ற செயல்பாடுகள் குறித்து...

Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!

ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ లండన్‌లోని నివాసం అమ్మకానికి పెట్టారు....