19
October, 2026

A News 365Times Venture

19
Monday
October, 2026

A News 365Times Venture

Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు

Date:

సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ముంబై ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ఆయన తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలోని స్థానిక ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ముంబై ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు చెబుతున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా అన్నా హజారే బలహీనపడారు. ప్రస్తుతం అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఉన్నారు.

అన్నా హజారే తీవ్ర వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్య సేవల కోసం ముంబైకి తరలించినట్లు వెల్లడించారు. ముంబై ఆస్పత్రిలో అన్నా హజారే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమగ్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై వైద్య బృందం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അവരുടെ മാപ്പ് അംഗീകരിക്കുന്നില്ല; അപകീര്‍ത്തികരമായ വാര്‍ത്ത നല്‍കിയ എ.ബി.പിക്കെതിരെ നിയമ നടപടി സ്വീകരിക്കുമെന്ന് നേഹ സിങ് റാത്തോഡ്

ന്യൂദല്‍ഹി: ഉത്തര്‍ പ്രദേശിലെ ബി.ജെ.പി സര്‍ക്കാരിനെ വിമര്‍ശിക്കാരുള്ള ഭോജ്പൂരി നാടന്‍പാട്ട് ഗായിക...

72 குண்டுகள் முழங்க அரசு மரியாதையுடன் தேவா உடல் நல்லடக்கம்; சொந்த ஊர் மக்கள் திரண்டு வந்து அஞ்சலி!

`தேனிசைத் தென்றல்’ என்று கொண்டாடப்பட்ட இசையமைப்பாளர் தேவாவின் திடீர் மரணம் திரையுலகினர்...

Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!

Tiger Shroff Firing: బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ఆదివారం...

നല്ല ബസ്സുകളും നല്ല ശൗചാലയവുമുണ്ടാക്കുക; കെ.എസ്.ആര്‍.ടി.സി മൂന്ന് നാല് വര്‍ഷങ്ങള്‍ക്കുള്ളില്‍ ലാഭകരമാകും: സി.എന്‍ വിജയകൃഷ്ണന്‍

കോഴിക്കോട്:നല്ല ബസ്സുകള്‍ ഇറക്കുകയും യാത്രക്കാര്‍ക്കായി ഏറ്റവും വൃത്തിയുള്ളതും ആധുനികവുമായ ശൗചാലയം ഉണ്ടാക്കുകയും...