26
August, 2026

A News 365Times Venture

26
Wednesday
August, 2026

A News 365Times Venture

Rahul Gandhi: కృతి సనన్‌ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు

Date:

రక్షాబంధన్ సందర్భంగా బాలీవుడ్ నటి కృతి సనన్ చేసిన యాడ్ తీవ్ర దుమారం రేపుతోంది. యాడ్‌లో కృతి సనన్ వస్త్రధారణపై బాలీవుడ్ నటి, బీజేపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. యాడ్‌లో కృతి ధరించిన దుస్తులు “ఉద్దేశపూర్వకంగా అసహజంగా” ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దీనికి కృతి సనన్‌‌ను కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

కృతి సనన్ కౌంటర్

మహిళలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని వారి దుస్తులను బట్టి ఎందుకు నిర్ణయిస్తున్నారని కృతి సనన్ ప్రశ్నించారు. సంస్కృతి, సంప్రదాయాలు హృదయంలో ఉంటాయని.. నెక్‌లైన్‌లో కాదన్నారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం మనం ఎప్పుడు ఆపుతాం? అని కృతి సనన్ కౌంటర్ ఇచ్చారు. రక్షాబంధన్ తనకు, తన సోదరికి ఎంతో ప్రత్యేకమైనదని కృతి తెలిపారు. ఈ పండుగ కేవలం సోదరుడు-సోదరి మధ్య రక్షణ బంధానికే పరిమితం కాదని.. తాను, తన సోదరి ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని చెప్పారు. సోదరుడు ఎంతగా రక్షించగలడో.. తాము కూడా ఒకరినొకరు అంతే రక్షించుకోగలమని పేర్కొన్నారు. తమ పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులేనని తెలిపారు.

రాహుల్ మద్దతు..

వివాదం నడుస్తున్న వేళ కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కృతి సనన్‌కు మద్దతు తెలిపారు. మహిళలు ఏం ధరించాలి.. ఎలా జీవించాలి అనే నిర్ణయం పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహిళల స్వేచ్ఛను ప్రశ్నిస్తూ వారిని ఆన్‌లైన్‌లో ట్రోల్ చేయడం ఆపాలని సూచించారు.

యాడ్ ఇదే..

కృతి సనన్ రక్షాబంధన్ సందర్భంగా ఓ ప్రముఖ నగల బ్రాండ్ కోసం చేసిన ప్రకటన ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ యాడ్‌లో కృతి ఐవరీ రంగు బ్రాలెట్‌, స్కర్ట్‌తో పాటు కేప్ ధరించి కనిపించారు. తన సోదరుడికి రాఖీ కడుతున్నట్లు ప్రకటనలో చూపించారు. వారి పెంపుడు కుక్క కూడా యాడ్‌లో కనిపించింది.

ఈ ప్రకటనపై కొందరు సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృతి ధరించిన దుస్తులపై విమర్శలు రావడంతో పాటు.. ఆమె తన పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టడాన్ని కొందరు తప్పుబట్టారు. దీంతో ఈ వివాదం క్రమంగా మహిళల దుస్తులు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల సమయంలో మహిళలు ఎలా ఉండాలనే అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది.

తాజాగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కృతికి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడంతో రాజకీయ చర్చగా మారింది. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే. తమ జీవితంపై స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కును గౌరవించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్పందనపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

 

54

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೆರೆಯಲ್ಲಿ ಒಂದೇ ಕುಟುಂಬದ 6 ಜನರ ಶವ ಪತ್ತೆ..

ವಿಜಯಪುರ, ಆಗಸ್ಟ್,26,2026 (www.justkannada.in): ವಿಜಯಪುರದ ಐತಿಹಾಸಿಕ ಭೂತನಾಳ ಕೆರೆಯಲ್ಲಿ ಒಂದೇ...

പുരുഷാധിപത്യത്തെ തകര്‍ക്കുക എന്നതിനെ എന്തിനാണ് ഹിന്ദു – മുസ് ലിം പ്രശ്‌നമാക്കുന്നത്: റിജിജുവിനോട് സൗരവ്

ന്യൂദല്‍ഹി: പുരുഷാധിപത്യത്തെ തകര്‍ക്കുക എന്ന രാഹുല്‍ ഗാന്ധിയുടെ പ്രസ്താവനക്കെതിരെ കേന്ദ്ര മന്ത്രി...

900 மாணவிகள்… மூன்றே கழிப்பறைகள்… தவிக்கும் புதுக்கோட்டை மாணவிகள்; முதல்வருக்கு கோரிக்கை

தமிழகத்தில் பல அரசுப் பள்ளிகள் மாணவர் சேர்க்கை இன்றி வெறிச்சோடிப் போய்க்கிடக்கும்...

ಮೈಸೂರು ದಸರಾ ಅಂಬಾರಿ ಆನೆ ಅಭಿಮನ್ಯುಗೆ ಅಭಿಮಾನದ ಬೀಳ್ಕೊಡುಗೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,26,2026 (www.justkannada.in):  ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಜಂಬೂಸವಾರಿಯಲ್ಲಿ ಸತತ ಹಲವು...