25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

Kiss Car: బాయ్‌ ఫ్రెండ్‌ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు

Date:

ప్రేమికుల మధ్య ఉండే సంబంధాన్ని అమ్మాయి-అబ్బాయిలు బహుమతుల ద్వారా వ్యక్తపరుచుకుంటారు. ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడంతో ప్రేమను తెలియజేసుకుంటారు. అయితే అందరిలా చేస్తే స్పెషల్ ఏముంటుందని అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. ఓ ప్రేమికురాలు.. తన ప్రియుడిపై ఉన్న ప్రేమను వెరైటీగా వ్యక్తం చేసింది. కానీ ఖాకీలు మాత్రం బిగ్ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్‌ ప్రియురాలు వెరైటీగా ప్రేమను వ్యక్తం చేయాలను కుంది. అంతే ఆదిత్యకు చెందిన మారుతి స్విఫ్ట్ కారుపై లిప్‌స్టిక్‌తో ముద్దుల గుర్తులు వేసింది. ఇలా కారు నిండా ఏకంగా 3,400 ముద్దులు వేసింది. దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు కష్టపడి కారు మొత్తం లిప్‌స్టిక్ ముద్దులతో నింపింది. సుమారు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు కారుపై వేసింది. ఇంతటితో బాగానే ఉంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఏకంగా 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో జంట కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు.

అయితే ఈ వీడియో చివరకు ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలించిన పోలీసులు.. లిప్‌స్టిక్ గుర్తులతో నిండిన కారును గుర్తించే ప్రయత్నం చేశారు. నగర రోడ్లపై తిరుగుతున్న దృశ్యాలతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ రఘువంశీ నేతృత్వంలో పోలీసులు వాహనం ఆచూకీని గుర్తించారు. చివరకు గ్వాలియర్‌లోని తాతీపూర్ ప్రాంతంలో కారును గుర్తించారు. వాహనాన్ని మార్పులు చేసిన నిబంధనల కింద మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ప్రియుడు ఆదిత్యకు రూ.5,500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో జోకులు..

ఈ ఘటనకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఈ కారుకు వచ్చిన ముద్దులు చాలా మంది మనుషులకు జీవితాంతం కూడా దక్కవని కామెంట్లు చేశారు. మరికొందరు ఇంతగా కారు రంగు మారితే కొత్త రంగుగా రవాణా శాఖలో నమోదు చేయాలా? అంటూ సరదాగా ప్రశ్నించారు. ఇంకొందరు మాత్రం సోషల్ మీడియా లైక్స్ కోసం చేసిన రొమాంటిక్ ప్రయత్నానికి చివరకు జరిమానా చెల్లించాల్సి వచ్చిందని ఆదిత్యపై సానుభూతి వ్యక్తం చేశారు.

 

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕಾವೇರಿ ವಿಚಾರದಲ್ಲಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಮತ್ತೆ ಹಿನ್ನಡೆ: CWRC ಆದೇಶ ಎತ್ತಿಹಿಡಿದ CWMA

ನವದೆಹಲಿ, ಆಗಸ್ಟ್, 25,2026 (www.justkannada.in):  ಕಾವೇರಿ ನದಿ ನೀರು ವಿವಾದಕ್ಕೆ...

ഗസയില്‍ ഇസ്രഈല്‍ സൈന്യം കൊലപ്പെടുത്തിയത് 21,500 കുട്ടികളെ; കണക്കുകള്‍ പുറത്തുവിട്ട് മീഡിയ ഓഫീസ്

ഗസസിറ്റി: 2023 ഒക്ടോബറിന് ശേഷം ഗസയില്‍ ഇസ്രഈല്‍ സൈന്യം 21,500 കുട്ടികളെ...

'அதானிக்காக பரந்தூரை காலி செய்ய வேண்டாமென ஸ்டாலினிடம் வலியுறுத்தினோம்… ஆனால்!'- அமைச்சர் வன்னிஅரசு

நேற்று சட்டமன்றத்தில் பேசிய முதல்வர் விஜய் '110' விதியின் கீழ் பரந்தூர்...

KPSC ಹಗರಣ ತನಿಖೆ ಸಿಬಿಐಗೆ ವಹಿಸುವಂತೆ ಆಗ್ರಹ: ಸಿಎಂ ಗೃಹ ಕಚೇರಿ ಮುಂದೆ ABVP ಪ್ರತಿಭಟನೆ..

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,25,2026 (www.justkannada.in): ಕೆಪಿಎಸ್ ಸಿಯಲ್ಲಿ ನಡೆದಿದೆ ಎನ್ನಲಾದ ಪಶುವೈದ್ಯಾಧಿಕಾರಿ ನೇಮಕಾತಿ...