21
August, 2026

A News 365Times Venture

21
Friday
August, 2026

A News 365Times Venture

రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!

Date:

CMF Buds Neo: నథింగ్ (Nothing) సబ్‌-బ్రాండ్ సీఎంఎఫ్ (CMF) సంస్థ నుండి భారత మార్కెట్లో కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. CMF Buds Neo పేరుతో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ ఎంట్రీ-లెవల్ ధరలోనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, మంచి బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. స్టైలిష్ డిజైన్‌తో పాటు రోజువారీ మ్యూజిక్, కాల్స్, గేమింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించారు.

ప్రత్యేకమైన డిజైన్:

CMF Buds Neo ఛార్జింగ్ కేస్ జ్యామెట్రిక్ స్క్వేర్ డిజైన్‌తో వస్తుంది. దీనికి కాంట్రాస్టింగ్ సర్క్యులర్ డయల్‌తో పాటు లాన్యార్డ్ హోల్‌ను అందించారు. ఇయర్‌బడ్స్‌కు IP54 రేటింగ్, ఛార్జింగ్ కేస్‌కు IPX2 రేటింగ్ ఉంది. దీంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి ఇయర్‌బడ్స్‌కు కొంత రక్షణ లభిస్తుంది.

Nothing X యాప్:

ఆడియో కోసం 12.4mm డైనమిక్ డ్రైవర్‌ను ఉపయోగించారు. ఇందులో టైటానియం కోటెడ్ PET డోమ్, ఫ్లెక్సిబుల్ PEEK + PU సరౌండ్ ఉన్నాయి. AAC, SBC బ్లూటూత్ కోడెక్‌లతో పాటు స్టాటిక్ స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా లభిస్తుంది. Nothing X యాప్ ద్వారా ఆడియోను మీకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇమ్మర్షన్ బూస్ట్, పాప్, రాక్, ఎలక్ట్రానిక్, ఎన్‌హాన్స్ వోకల్స్, క్లాసికల్ వంటి ఆరు ప్రీసెట్ ఈక్వలైజర్ ప్రొఫైల్స్ ఉన్నాయి. కస్టమ్ EQ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. బాస్‌ను ఆఫ్, లెవల్ 1, లెవల్ 2గా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ (ANC):

CMF Buds Neoలో 35dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించారు. ఇందులో మూడు మాన్యువల్ ANC లెవల్స్‌తో పాటు యాంబియంట్ నాయిస్‌కు అనుగుణంగా నాయిస్ క్యాన్సిలేషన్‌ను ఆటోమేటిక్‌గా మార్చే అడాప్టివ్ మోడ్ కూడా ఉంది. కాల్ నాణ్యత కోసం రెండు ఇయర్‌బడ్స్‌లో కలిపి 4 HD మైక్రోఫోన్లు ఉన్నాయి. ఒక్కో ఇయర్‌బడ్‌లో రెండు మైక్రోఫోన్లు పనిచేస్తాయి. “క్లియర్ వాయిస్ టెక్నాలజీ” ద్వారా చుట్టుపక్కల శబ్దాలను తగ్గించి స్పష్టమైన వాయిస్ కాల్స్ అందించేలా రూపొందించారు.

బ్యాటరీ:

బ్యాటరీ పరంగా కూడా ఇది ఆకట్టుకునేలా ఉంది. ఒక్కో ఇయర్‌బడ్‌లో 45mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 460mAh బ్యాటరీని అందించారు. ANC ఆఫ్‌లో ఇయర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 11 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం బ్యాటరీ బ్యాకప్ 52 గంటల వరకు ఉంటుంది. ANC ఆన్‌లో ఇయర్‌బడ్స్ 8 గంటల వరకు, కేస్‌తో కలిపి 30 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ANC ఆఫ్‌లో 5.5 గంటల వరకు మ్యూజిక్ వినొచ్చు. యూఎస్‌బీ టైప్-C ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 70 నిమిషాల సమయం పడుతుంది.

ఇతర ఫీచర్లు:

CMF Buds Neoలో బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 6.0, అంతకంటే పై వెర్షన్లతో పాటు iOS 13, అంతకంటే పై వెర్షన్లకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అలాగే డ్యూయల్ కనెక్షన్, టచ్ కంట్రోల్స్, కస్టమ్ ఈక్వలైజర్, అల్ట్రా-లో లేటెన్సీ గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిని Nothing X యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.

ధర:

ఈ కొత్త ఇయర్‌బడ్స్ బ్లాక్, వైట్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. భారత మార్కెట్లో వీటి ఎక్స్‌క్లూజివ్ లాంచ్ ధర రూ.1,999గా నిర్ణయించారు. ఆగస్టు 26, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి రిటైల్ పార్ట్‌నర్ల ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయి. రూ.2,000 లోపు బడ్జెట్‌లో 35dB ANC, 52 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి CMF Buds Neo బెస్ట్ ఆప్షన్‌.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಿ.ನಾಗೇಂದ್ರ ರಾಜೀನಾಮೆಗೆ ಆಗ್ರಹ:  ಕಪ್ಪು ಟೀ ಶರ್ಟ್ ಧರಿಸಿ BJP-JDS ಶಾಸಕರ ಪ್ರತಿಭಟನೆ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,21,2026 (www.justkannada.in): ಸಚಿವ ಬಿ.ನಾಗೇಂದ್ರ ರಾಜೀನಾಮೆಗೆ ಆಗ್ರಹಿಸಿ ಬಿಜೆಪಿ-ಜೆಡಿಎಸ್ ಶಾಸಕರು...

അമേരിക്ക സന്ദര്‍ശിക്കാന്‍ അനുമതി നിഷേധിച്ച് കേന്ദ്ര സര്‍ക്കാര്‍; രേവന്ത് റെഡ്ഡി തിരികെ മടങ്ങും

ഹൈദരാബാദ്: അമേരിക്കന്‍ സന്ദര്‍ശനത്തിന് കേന്ദ്രസര്‍ക്കാരിന്റെ അനുമതി ലഭിക്കാത്തതിനെ തുടര്‍ന്ന് തെലങ്കാന മുഖ്യമന്ത്രി...

தொகுதி மறுவரையறை: “ராகுல் காந்தி குறிப்பிட்ட அந்த 'எட்டப்பர்' விஜயா?" – திமுக எம்.பி தயாநிதிமாறன்

தென் மண்டல நிர்வாகக்குழு கூட்டம் மத்திய உள்துறை அமைச்சர் அமித் ஷாவின்...

ಬಿಸಿಯೂಟ ನೌಕರರಿಗೆ ಕನಿಷ್ಠ ವೇತನ ಹೆಚ್ಚಿಸಲು ಸಹಾಯ ಮಾಡುವೆ: ಸಚಿವ ಮಧು ಬಂಗಾರಪ್ಪ ಭರವಸೆ

ಬೆಂಗಳೂರು, ಆಗಸ್ಟ್,20,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ಬಿಸಿಯೂಟ ನೌಕರರ ಪರವಾಗಿ ಎಂದಿಗೂ...