11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..

Date:

Snake bite: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అత్యవసర సమయాల్లో ఎలా ఉపయోగపడుతుందనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్‌ను పాము కాటేసింది. బిజౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పూరన్ సికర్వార్ తన ప్రభుత్వ క్వార్టర్స్‌లో నిద్రిస్తుండగా.. మంచంలో దాక్కున్న విషపూరితమైన కట్లపాము ఆయన చేతిని రెండుసార్లు కాటు వేసింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాము కాటు తర్వాత సహాయం కోసం గట్టిగా అరవడంతో స్టేషన్ ఇంఛార్జ్ సౌరభ్ శ్రీవాస్తవ, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

మంచంపై ఉన్న పామును గుర్తించిన స్టేషన్ ఇంఛార్జ్ ముందుగా దానిని ఫోటో తీసి, ఏఐ ద్వారా సమాచారం సేకరించారు. ఏఐ ఇచ్చిన సూచనల ప్రకారం ప్రథమ చికిత్స చేశారు. ఏఐ సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్‌ను వెంటనే జయరోగ్య ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పాము ఫోటోను పరిశీలించి, ఫోటో ఆధారంగా కట్ల పాముగా తేల్చి, దాని విషానికి విరుగుడు చికిత్స పాటించారు. చివరకు సికర్వార్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. సిబ్బంది సమయస్పూర్తి, ఏఐ సాయంతో కానిస్టేబుల్ ప్రాణాలు దక్కాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എല്ലാം നിയമാനുസൃതമായാണ് നടക്കുന്നത് : പ്രതിഷേധത്തിന്മേലുള്ള യു.എന്‍ പ്രസ്താവനയില്‍ ഇന്ത്യ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ നടക്കുന്ന സമരത്തില്‍ പ്രതിഷേധക്കാര്‍,...

"அரசுகள் மாறினாலும் தமிழ்நாடு மக்களுக்குச் சேவை புரிவதில் என் மன உறுதி தொடர்கிறது" – பிரதமர் மோடி

தமிழகத்தில் பல்வேறு திட்டங்களைத் தொடங்கி வைக்க, இன்று பிரதமர் நரேந்திர மோடி...

Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!

Lancet Report: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) దుర్వినియోగం, అణుయుద్ధం, జీవ ఆయుధాల వినియోగంతో...

പോരാട്ടം ഇപ്പോള്‍ തുടങ്ങിയിട്ടേയുള്ളൂ; ഗ്യാനേഷിനെതിരെ മാത്രമല്ല മോദിക്കും അമിത്ഷായ്ക്കും എതിരെ കൂടെയാണ് പ്രതിഷേധം: സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയില്‍ മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരായ പ്രതിഷേധം തുടരുമെന്ന്...