12
August, 2026

A News 365Times Venture

12
Wednesday
August, 2026

A News 365Times Venture

Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..

Date:

Pakistan: ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’గా పిలుస్తున్న ఈ ఒప్పందం ప్రకారం, ఈ మూడు దేశాలు సైనికంగా సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపైనా దాడి జరిగినా, ముగ్గురిపై జరిగినట్లే భావిస్తాయి. అయితే, ఈ కూటమిని మరింత విస్తరించాలని పాకిస్తాన్ భావిస్తోంది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ముస్లిం దేశాలకు కీలక పిలుపునిచ్చారు. విభేదాలు అన్ని పక్కన పెట్టి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌లో చేరాలని ఆయన కోరారు. నాటో తరహాలో ముస్లిం దేశాల సైనిక కూటమిగా దీనిని విస్తరించాలని సూచించారు. ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రక్షణ ఒప్పందం ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌గా ఉండకూడదని అన్నారు. ఇతర దేశాలకు ఇందులో చేరే అవకాశం ఇవ్వాని, కూటమిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముస్లిం దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలు, ద్వైపాక్షిక వివాదాలను పక్కన పెట్టి ఒకే వేదికపై నిలబడాలని నాటో తరహాలో ఈ కూటమి పనిచేయాలని అన్నారు.

సౌదీ అరేబియాని మక్కా వేదికగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌లు శుక్రవారం ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’పై సంతకాలు చేశారు. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిరాన్ ఈ ఒప్పందాన్ని నాటోలోని ఆర్టికల్ 5కు సమానమైన పరస్పర రక్షణ వ్యవస్థగా అభివర్ణించారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం, ఏ దేశమైనా నాటోలోని సభ్యదేశంపై దాడి చేస్తే అది మొత్తం నాటోపై దాడిగా భావిస్తుంది.

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ కూటమిని విస్తరించాలని భావిస్తున్నాడు. ఈజిస్ట్ సహా మరికొన్ని దేశాలు భవిష్యత్తులో ఇందులో చేరే అవకాశం ఉందని టర్కీ విదేశాంగ మంత్రి చెప్పారు. ఈ కూటమి ఇరాన్ లేదా మరే దేశానికి వ్యతిరేకంగా ఏర్పాటు కాలేదని స్పష్టం చేశారు. మూడు దేశాల భద్రతకు పరస్పరం మద్దతు ఇవ్వడమే దీని ఉద్దేశమని చెప్పారు. ఈ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా వ్యాఖ్యానించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು ಬಿಡದಂತೆ ಆಗ್ರಹ: ಮೈಸೂರಿನಲ್ಲಿ ರೈತರಿಂದ ಪ್ರತಿಟನೆ, ಕಾಡಾ ಕಚೇರಿಗೆ ಮುತ್ತಿಗೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,12,2026 (www.justkannada.in): ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು ಹರಿಸದಂತೆ ಆಗ್ರಹಿಸಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ರೈತರು...

ഇന്ത്യയുടെ ഊര്‍ജ്ജ നയം എന്താണെന്ന് മറ്റുള്ളവര്‍ തീരുമാനിക്കേണ്ട; അമേരിക്കന്‍ കമ്പനികളെ ബഹിഷ്‌കരിക്കണമന്ന് ആര്‍.എസ്.എസ് വിഭാഗം

ന്യൂദല്‍ഹി: റഷ്യയില്‍ നിന്ന് എണ്ണ വാങ്ങുന്നതിന്റെ പേരില്‍ ഇന്ത്യയ്ക്കുമേല്‍ അമേരിക്ക ചുമത്തുന്ന...

‘ஹார்முஸ் எங்கள் கட்டுப்பாட்டில்’ ட்ரம்ப் சொல்கிறார்; இருந்தும், அங்கே போக்குவரத்தில் சிக்கல்!

ஈரான் போரில் எத்தனை முறை மீண்டும் மீண்டும் தாக்குதல் தொடங்கினாலும், அதன்...

ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ರಾಮ್‌ನಾಥ್ ಕೋವಿಂದ್ ಆತ್ಮಕಥೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ ಪ್ರಧಾನಿ ಮೋದಿ

ನವದೆಹಲಿ, ಆಗಸ್ಟ್,12,2026 (www.justkannada.in):  ದೇಶದ 14ನೇ ರಾಷ್ಟ್ರಪತಿಯಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸಿದ...