5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు

Date:

Chandrababu on Mega DSC: డీఎస్సీ విషయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో కైకలూరు, కలిదిండి సభలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా కొందరు కోర్టులను ఆశ్రయించారని, అనంతరం కోర్టులో ఉన్న అంశాలను పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయి ఏడాది తర్వాత వైసీపీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీలో నీట్ లీక్ జరిగితే ఇక్కడ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థుల పేరుతో అనవసర ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రోడ్లపై స్వైరవిహారం చేస్తే సహించను
అనవసర ఆందోళనలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడాన్ని ప్రభుత్వం సహించదని చంద్రబాబు స్పష్టం చేశారు. రోడ్లన్నీ కొందరు స్వైరవిహారం చేయడానికి, ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలను తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తాను మౌనంగా ఉంటే ఎవరినీ నిద్రపోనివ్వరని, రోజూ రౌడీయిజం చేసే పరిస్థితులు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులపై క్రెడిట్ వ్యాఖ్యలు
భోగాపురం విమానాశ్రయం విషయంలోనూ రాజకీయంగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భోగాపురం తానే నిర్మించానని కొందరు చెప్పుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా దానిని తానే పూర్తి చేశానని చెప్పుకునే పరిస్థితి వస్తుందని, రేపు అమరావతి పూర్తయితే అది కూడా తానే నిర్మించానని చెప్పుకునే అవకాశం ఉందని విమర్శించారు.

రౌడీయిజం చేయను.. రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటా
తాను రౌడీయిజం చేయనని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే రౌడీలకు మాత్రం సింహ స్వప్నంగా ఉంటానని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకోవడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. కాగా, డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಚು. ಆಯೋಗದ ಮುಂದೆ ಧರಣಿ ಮಾಡಿಲ್ಲ: ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ನನ್ನ ಮೇಲೆ ಕೇಸ್ ಹಾಕಲಿ- ಸಿಎಂ ಡಿಕೆಶಿ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,3,2026 (www.justkannada.in): ನಾನು ಚುನಾವಣಾ ಆಯುಕ್ತರ ಮುಂದೆ ಧರಣಿ ಮಾಡಿಲ್ಲ....

മറ്റ് സമുദായങ്ങളുടെ ജനസംഖ്യ കൂടി; ഹിന്ദുക്കള്‍ നേരത്തെ കല്യണം കഴിച്ച് അഞ്ച് കുട്ടികളെയുണ്ടാക്കണം: ബി.ജെ.പി എം.പി

ഭോപ്പാല്‍: ഹിന്ദുക്കള്‍ നേരത്തെ കല്യാണം കഴിക്കണമെന്നും അഞ്ച് കുട്ടികളെ വീതം ഉണ്ടാക്കണമെന്നും...

By Election: `டாஸ்மாக் மூடல், வெளியூர் நபர்கள் வெளியேற உத்தரவு!'- தேர்தல் ஆணையம் சொல்வது என்ன?

தமிழ்நாட்டில் மதுராந்தகம் மற்றும் தாராபுரம் ஆகிய இரண்டு தனி தொகுதிகளுக்கான இடைத்தேர்தல்...

Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

ఒకప్పుడు స్నీకర్లను కేవలం క్రీడలకు లేదా సాధారణ అవసరాల కోసం ధరించే...