5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Date:

Lal Darwaza Bonalu: హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు వేళ నగరంలో పండుగ శోభ సంతరించుకుంది. ఏటా ఆషాఢమాసంలో వైభవంగా జరిగే ఈ జాతర కోసం అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 4:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ అనంతరం దేవాలయం తరఫున తొలి బోనం సమర్పించారు. ఉదయం 6:00 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రభుత్వం తరఫున ఉదయం 10:30 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులు బోనాలు, ఒడి బియ్యం, చీర, సారెను అమ్మవారికి నివేదించనుండగా, సాయంత్రం వేళ అమ్మవారి శాంతి కళ్యాణం వైభవంగా జరగనుంది. లాల్ దర్వాజాలోని ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల్లోని దాదాపు 3,000 చిన్న దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్త్రృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఆవరణ చిన్నది కావడంతో భక్తుల కోసం 6 ప్రత్యేక క్యూలైన్లను, బోనం తీసుకొచ్చే వారికి ప్రత్యేక మార్గాన్ని రూపొందించారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లు, ఉచిత వైద్య శిబిరాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. ముందస్తు సమాచారం అందించిన జోగిణులకు అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. ఇది సున్నితమైన ప్రాంతం కావడంతో 100 సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో పాటు 2,500 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రోజున ప్రతిష్టాత్మక ‘రంగం’ భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్రతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 ಮೈಸೂರು ಅರಮನೆಗೆ ಎಂಟ್ರಿಕೊಟ್ಟ ಅಭಿಮನ್ಯು: ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಕೆ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,5,2026 (www.justkannada.in): ಕಳೆದ 6 ವರ್ಷಗಳ ಕಾಲ ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು...

നേഹ ബോറ തന്നേക്കാള്‍ മികച്ചതെന്ന് പറഞ്ഞതിനെ അംഗീകരിച്ച് ദീപ്‌കെ; താരതമ്യമല്ല, ഐക്യദാര്‍ഢ്യമാണ് വേണ്ടതെന്ന് നേഹ

ന്യൂദല്‍ഹി: തന്നേക്കാള്‍ കഴിവുള്ള നേതാവ് നേഹ ബോറ ആണെന്നുള്ള എക്‌സ് പോസ്റ്റ്...

`அவர்கள் அப்போதே கிளம்பிவிட்டார்களே.!" – அமெரிக்காவுக்கு ஈரான் அமைச்சர் அராக்சி பதிலடி

ஈரான் போர் நிறுத்தப் பேச்சுவார்த்தையில் மீண்டும் சுணக்கம் ஏற்பட்டுள்ளது. இரண்டு தரப்பும்...

KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అజేయ శతకం సాధించినప్పటికీ, భారత వికెట్...