24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!

Date:

Ragi Semiya Payasam: రాగితో ఇడ్లీ, దోసె, జావ, పొంగనాలంటూ వివిధ రకాల రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పాయసం కూడా ఒకటి. రాగిపిండితో సేమియా కలిపి ఇలా కమ్మని పాయసం చేశారంటే ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్​గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధి ఉంటాయి. సాధారణ మైదా లేదా తెల్ల సేమియాతో పోలిస్తే, రాగి పాయసం శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా బరువు పెరగకుండా కాపాడుతుంది. రాగులలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా అందిస్తుంది. ఇలాంటి పోషకాలు ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

నెయ్యి:1 టీస్పూన్
రాగి సేమియా: 250 గ్రాములు
నీళ్ళు: 500 మి.లీ
పాలు: 1 లీటరు
యాలకుల పొడి: 1 టీస్పూన్
జాజికాయ పొడి: చిటికెడు
చిక్కటి/పలచటి కొబ్బరి పాలు: 500 మి.లీ
పాలు/సక్కెర (చక్కెర): 1/2 కప్పు
ఉప్పు:1/2 టీస్పూన్

గార్నిషింగ్ కోసం:

నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు:4 టేబుల్ స్పూన్లు
కిస్మిస్: 2 టేబుల్ స్పూన్లు

తయారుచేసే విధానం:

ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో టీస్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక, రాగి సేమియా వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు దోరగా వేయించాలి. అందులో 500 మి.లీ నీళ్ళు పోసి, రాగి సేమియా నీటిని పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి. ఇప్పుడు పాలు, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. పాలు బాగా మరిగేంత వరకు ఉంచాలి. మంట తగ్గించి 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు కలిపి, మరొక పొంగు వచ్చే వరకు ఉంచాలి. పాయసం మెల్లగా చిక్కబడుతుంది. ఇప్పుడు పంచదార, చిటికెడు ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. చిన్న మూకుడులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలను వేయించాలి. చివరిగా కిస్మిస్ వేసి అవి ఉబ్బే వరకు వేయించి పాయసంలో కలపాలి. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి సేమియా పాయసాన్ని వేడిగా అయినా లేదా చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు!

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗര്‍ബ നൃത്തത്തിന് വരുമ്പോള്‍ നിങ്ങളുടെ സഹോദരിമാരെയും പെണ്‍മക്കളെയും കൊണ്ടുവരൂ: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗ ഭീഷണിയുമായി ബി.ജെ.പി എം.എല്‍.എ

ഭോപാല്‍: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗഭീഷണിയുമായി ഭോപ്പാലിലെ ഹുസൂരില്‍ നിന്നുള്ള ബി.ജെ.പി എം.എല്‍.എ...

"எடப்பாடியுடன் கூட்டணி வைத்தால் துணை முதல்வர் பதவி என்றார் ஆதவ் அர்ஜுனா" – ரகசியம் பகிர்ந்த சீமான்

தாராபுரம் இடைத்தேர்தலில் நாம் தமிழர் கட்சி வேட்பாளராக களத்தில் உள்ள கார்த்திகாவை...

AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు

AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకడం...

ഗ്യാനേഷ് കുമാറിനെ ജയിലിലടക്കണം; ബാലറ്റ് പേപ്പറുകള്‍ ഉപയോഗിച്ച് തെരഞ്ഞെടുപ്പുകള്‍ വീണ്ടും നടത്തണം: ഉദ്ധവ് താക്കറെ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ രൂക്ഷവിമര്‍ശനവുമായി ശിവസേന (യു.ബി.ടി)...