1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

Gangavaram Beach: ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం.. స్నేహితురాలిని కాపాడబోయి యువకుడు గల్లంతు!

Date:

Friendship Day Tragedy in Visakhapatnam: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సరదాగా గడపాలని వెళ్లిన స్నేహితుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్‌లో సముద్ర అలలు ఇద్దరిని లోనికి లాక్కెళ్లాయి. యువతి నీతూ (18), యువకుడు దామోదర్ గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు, బీచ్ లైఫ్‌గార్డులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏడుగురు స్నేహితులు పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. వారిలో నలుగురు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారు. బీచ్ సమీపంలో అందరూ కలిసి ఫోటోలు దిగుతుండగా.. జాలరిపేటకు చెందిన నీతూ ప్రమాదవశాత్తు సముద్ర అలల్లో కొట్టుకుపోయింది. ఆమెను గమనించిన పెందుర్తికి చెందిన దామోదర్ వెంటనే సముద్రంలోకి దిగి రక్షించేందుకు ప్రయత్నించాడు. అయితే బలమైన అలల కారణంగా అతడు కూడా గల్లంతయ్యాడు.

గల్లంతైన నీతూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. మరోవైపు దామోదర్‌కు కొద్ది రోజులలో కనకమహాలక్ష్మి అనే యువతితో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బీచ్ లైఫ్‌గార్డులతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. సముద్రంలో గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బలమైన అలలు, సముద్ర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. వారిని గుర్తించేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಫಾರ್ಮ್‌ 7 ದುರ್ಬಳಕೆ: FIR ದಾಖಲಿಸಿ ತನಿಖೆ ನಡೆಸುವವರೆಗೂ ಧರಣಿ ಕೈಬಿಡಲ್ಲ-ಬಿ.ಕೆ ಹರಿಪ್ರಸಾದ್

ಬೆಂಗಳೂರು,ಅಕ್ಟೋಬರ್‌,1,2026 (www.justkannada.in): ಫಾರ್ಮ್‌ ೭ ಮೂಲಕ ಮತದಾರರ ಪಟ್ಟಿಯಿಂದ ಮತದಾರರ...

തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസിന്റെ മരവിപ്പിച്ച നാല് അക്കൗണ്ടുകള്‍ പ്രവര്‍ത്തിപ്പിക്കാന്‍ അനുമതി നിഷേധിച്ച് സുപ്രീം കോടതി

  ന്യൂദല്‍ഹി: ഭൂമി വിതരണ അന്വേഷണവുമായി ബന്ധപ്പെട്ട് മരവിപ്പിച്ച അക്കൗണ്ടുകള്‍ പ്രവര്‍ത്തിപ്പിക്കാന്‍...

புதுச்சேரி: அமைச்சருக்கு கொலை மிரட்டல்! – தவெக ஆதரவு எம்எல்ஏ மீது 7 பிரிவுகளில் வழக்கு; முழு பின்னணி

புதுச்சேரியில் இருசக்கர வாகனத்தில் `லிஃப்ட்' தருவதாகக் கூறி பெண் ஒருவர் பாலியல்...

Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి ఘోర ప్రమాదం...