17
August, 2026

A News 365Times Venture

17
Monday
August, 2026

A News 365Times Venture

Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Date:

Dharmendra Pradhan Resigns: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస నిరసనలు, ధర్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. యువత ఆకాంక్షలను గౌరవించే నిర్ణయమే ఇదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశంలో నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు మరింత ముమ్మరమయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్న తర్వాతే దేనిపైనైనా చర్చ జరుగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

உ.பி முசாபர்நகர் நீதிமன்றம்: `4 மாதத்தில் 22 பேருக்கு தூக்குத் தண்டனை' – நடுங்கும் கைதிகள்

தூக்குத்தண்டனை என்பது மிகவும் கொடூரமான குற்றங்களுக்கு வழங்கப்படுவது வழக்கம். இந்நிலையில் உத்தரப்பிரதேசத்தை...

Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!

Guntur Chilli Export Crisis: గుంటూరు మిర్చికి శ్రీలంకలో ఎదురుదెబ్బ తగిలింది....

സ്കൂളുകൾ അടച്ചുപൂട്ടുന്നതിനിടെ യു.പിയിൽ ജെൻ സികളെ ‘ഗോമിത്ര’ങ്ങളാക്കാൻ യോഗി സർക്കാർ; 10,000 പേർക്ക് പരിശീലനം

ലഖ്‌നൗ: ഉത്തർപ്രദേശിൽ ജെൻസി യുവാക്കളെ ‘ഗോമിത്ര’ങ്ങളാക്കി ഗോസംരക്ഷണ പ്രവർത്തനങ്ങളിൽ നിയോഗിക്കാൻ യോഗി...