18
July, 2026

A News 365Times Venture

18
Saturday
July, 2026

A News 365Times Venture

Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్‌.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?

Date:

Delhi Police Commissioner: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ కుమార్, ఈ నియామకానికి ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో స్పెషల్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సతీష్ గోల్చాను పదవీకాలం పూర్తికాకముందే ఆ బాధ్యతల నుంచి తప్పించారు. 1992 బ్యాచ్ AGMUT కేడర్‌కు చెందిన గోల్చా 2027 వరకు ఈ పదవిలో కొనసాగాల్సి ఉన్నప్పటికీ, పరిపాలనా మార్పుల్లో భాగంగా ముందుగానే రిలీవ్ చేశారు. అనురాగ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గోల్చా తదుపరి పోస్టింగ్ కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు రిపోర్ట్ చేయనున్నారు.

ఎవరు ఈ అనురాగ్ కుమార్?

అనురాగ్ కుమార్ పోలీసింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ రంగంలోనూ విశేష అనుభవం కలిగిన అధికారి. ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన, ఢిల్లీ పోలీస్‌లో పలు జిల్లాలకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా పనిచేశారు. అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరి అంతర్గత భద్రత, నిఘా కార్యకలాపాలకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2010లో పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ పురస్కారాలు లభించాయి. వ్యూహాత్మక ప్రణాళికలు, భద్రతా వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన అధికారిగా అనురాగ్ కుమార్‌కు మంచి గుర్తింపు ఉంది.

ఈ ఏడాది మార్చి 3న ఢిల్లీ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. 50 మంది ఐపీఎస్‌లు, 20 మంది డానిప్స్ అధికారులతో కలిపి మొత్తం 70 మంది అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేశారు. ఆ పరిపాలనా మార్పుల కొనసాగింపుగానే ఇప్పుడు అనురాగ్ కుమార్‌ను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించినట్లు భావిస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബ്രിട്ടീഷുകാര്‍ പോയി, കൊളോണിയല്‍ മനോഭാവം മാറിയില്ല’; വാങ്ചുകിന്റെ സമരത്തില്‍ കേന്ദ്രത്തിനെതിരെ മെഹബൂബ മുഫ്തി

ന്യൂദല്‍ഹി: നീറ്റ് പരീക്ഷാ ക്രമക്കേടുമായി ബന്ധപ്പെട്ട് കേന്ദ്ര വിദ്യാഭ്യാസ മന്ത്രി ധര്‍മേന്ദ്ര...

சரியும் இந்திய ரூபாய் மதிப்பு: 2 காரணங்கள் என்னென்ன? கண்காணிக்கும் ரிசர்வ் வங்கி

ஈரான் போர் புரிந்துணர்வு ஒப்பந்தத்திற்குப் பிறகு, ஒரு அமெரிக்க டாலருக்கு ரூ.92-93...