17
July, 2026

A News 365Times Venture

17
Friday
July, 2026

A News 365Times Venture

Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!

Date:

Chilli Egg Recipe: ఎగ్స్‌తో ఎప్పుడూ ఒకేలాంటి కూరలు, ఫ్రైలు తిని బోర్ కొట్టిందా..? అయితే ఇంట్లోనే కేవలం కొన్ని నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ రుచితో అద్భుతమైన ‘స్పైసీ చిల్లీ ఎగ్’ తయారు చేసుకోవచ్చు. దీనిని స్టార్టర్‌గా నేరుగా తినేయొచ్చు లేదా ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి వాటికి సైడ్ డిష్‌గా కూడా నంజుకోవచ్చు. ముఖ్యంగా స్పైసీగా తినాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. మరి దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

* కోడిగుడ్లు – 6
* నూనె – సరిపడినంత
* వెల్లుల్లి రెబ్బలు – 5 (సన్నగా తరిగినవి)
* అల్లం – చిన్న ముక్క (సన్నగా తరిగినది)
* పచ్చిమిరపకాయ – 1 (సన్నగా తరిగినది)
* ఉల్లిపాయ – 1 (పెద్ద ముక్కలుగా కోసినవి)
* క్యాప్సికం – 1 (పెద్ద ముక్కలుగా కోసినవి)
* ఉల్లికాడలు (Spring Onions) – కొద్దిగా
* ఉప్పు – రుచికి సరిపడా
* మిరియాల పొడి – 1 టీస్పూన్ + గుడ్ల కోసం కొద్దిగా
* కాశ్మీరీ కారం – 1 టీస్పూన్
* షెజ్వాన్ పేస్ట్ – 1 చిన్న టీస్పూన్
* సోయా సాస్ – 1 టీస్పూన్
* టొమాటో కెచప్ – 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి ఆరు కోడిగుడ్లను పగలగొట్టి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి (విస్క్ చేయాలి). మిశ్రమం అంతా నురుగు వచ్చేలా ఫ్లఫీగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టీస్పూన్ల నూనె వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. నూనె వేడెక్కాక గుడ్డు మిశ్రమాన్ని వేసి, అంచులను నెమ్మదిగా మధ్యలోకి నెడుతూ పొరటులా చేసుకోవాలి. అయితే, సాధారణ పొరటులా కాకుండా ముక్కలు కాస్త పెద్ద సైజులో ఉండేలా జాగ్రత్తగా కలుపుకొని, వేగాక ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే కడాయిలో (లేదా ఒక వెడల్పాటి పాన్) ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. మంటను కాస్త తగ్గించి, వెడ్జెస్‌లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌పై మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో అర టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ మిరియాల పొడి, ఒక టీస్పూన్ కాశ్మీరీ కారం వేసుకోవాలి. రుచిని పెంచేందుకు ఒక చిన్న టీస్పూన్ షెజ్వాన్ పేస్ట్, ఒక టీస్పూన్ సోయా సాస్, మూడు టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. క్యాప్సికం ముక్కలు కాస్త ఉడకడం కోసం కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.

సాస్ మిశ్రమం కాస్త చిక్కబడుతున్న సమయంలో క్రంచీ టేస్ట్ కోసం కొన్ని తరిగిన ఉల్లికాడలను (Spring onions) వేయాలి. సాస్ అంతా పర్ఫెక్ట్‌గా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గుడ్డు పొరటు ముక్కలను ఇందులో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. సాస్ అంతా గుడ్డు ముక్కలకు బాగా కోట్ అయ్యేలా చూసుకోవాలి. చివరగా మరికొన్ని ఉల్లికాడలను పైనుంచి చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘాటైన ‘స్పైసీ చిల్లీ ఎగ్’ రెడీ. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతమైన రుచితో బాగుంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സൗദി അറേബ്യക്ക് 1.96 ബില്യണ്‍ ഡോളറിന്റെ ആയുധങ്ങള്‍ വില്‍ക്കാന്‍ യു.എസ് അനുമതി

  വാഷിങ്ടണ്‍: സൗദി അറേബ്യക്ക് അത്യാധുനിക കൃത്യതയാര്‍ന്ന ആയുധങ്ങളും (precision-guided munitions)...

'விசாரணை என அழைத்து பத்திரிகையாளரை அச்சுறுத்தும் காவல்துறை!' – சென்னை பத்திரிகையாளர் மன்றம் கண்டனம்

தனியார் தொலைக்காட்சியை சேர்ந்த பத்திரிகையாளர் விஜயனை திருவல்லிக்கேணி காவல்துறையினர் விசாரணை என்ற...

Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?

Tollywood: ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా కలెక్షన్స్ పోస్టర్లకే...