12
July, 2026

A News 365Times Venture

12
Sunday
July, 2026

A News 365Times Venture

INS Mahendragiri: విశాఖలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

Date:

INS Mahendragiri: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఆధునిక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. బరాక్-8, బ్రహ్మోస్ క్షిపణులతో పాటు అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ నౌక భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేయనుంది. శత్రు రాడర్లకు చిక్కకుండా ప్రయాణించే సామర్థ్యం, జలాంతర్గాములను గుర్తించి నిర్వీర్యం చేసే వ్యవస్థలు దీనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, అధునాతన నౌకా నిర్మాణ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. యుద్ధం కంటే ప్రపంచ శాంతికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని, అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన సమాధానం ఇవ్వడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు.

మారిటైమ్ విజన్–2030, మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా నౌకా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు రాజ్‌నాథ్‌… ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి సముద్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి, భారతదేశాన్ని షిప్‌బిల్డింగ్, ఆవిష్కరణల రంగంలో అగ్రగామిగా నిలపడం లక్ష్యమని వివరించారు. ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి గా చేరిందన్న ఆయన.. సముద్ర రక్షణ లో విశాఖపట్నం ఒక బలమైన శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఏరో స్పేస్ రంగం అభివృద్ధి అవుతోంది.. ఫిఫ్త్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ టెక్నాలజీ అండర్ వాటర్ టార్పోడో అభివృద్ధి చేస్తున్నాం… కర్నూలు డ్రోన్ హబ్ అవుతుంది. ఆర్టిఫిషీయల్ ఇంటెల్ జెంట్స్ , న్యూ టెక్నాలజీ , అడ్వాన్స్ షిప్ తీసుకొస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ తో, ఫుల్ సర్వ్ లెన్స్ తో సరికొత్త ఆధునిక యుద్ధ శక్తి తో ముందుకు వెళ్తున్నాం.. కొత్త పరిజ్ఞానం యుద్ధానికి మాత్రమే కాదు ఒకోసారి మరో దేశానికి సహకారంగా కూడా నిలుస్తాం అన్నారు.. యుద్ధం మా నినాదం కాదు .. శాంతి, సర్వ ప్రపంచ శాంతి మా విధానం. ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు.. మన స్థిరత్వాన్ని బద్దలు కొడితే జరిగే పరిణామం చూపించాం అన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

'ஸ்டார்ட்… கேமரா… ஆக்ஷன்' – முதல்வர் விஜய் பேச்சு குறித்து ஜெயக்குமார் விமர்சனம்

சட்டமன்ற தேர்தல் படுதோல்விக்குப் பிறகு எடப்பாடி பழனிசாமி தன் தலைமையில் மாவட்ட...

Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్...

KPSC ಅಧ್ಯಕ್ಷರ ವಿರುದ್ದ ರಾಜ್ಯಪಾಲರಿಂದ ಕ್ರಮ ಆಗಬೇಕು- ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,11,2026 (www.justkannada.in): ಕೆಪಿಎಸ್ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ಶಿವಶಂಕರಪ್ಪ ಪುತ್ರಿ ವಿರುದ್ದ...

എസ്. ജാനകി അന്തരിച്ചു

മൈസൂരു:  വിഖ്യാത ഗായിക എസ്. ജാനകി അന്തരിച്ചു. മൈസൂരുവിലെ താമസസ്ഥലത്തായിരുന്നു അന്ത്യം....