4
July, 2026

A News 365Times Venture

4
Saturday
July, 2026

A News 365Times Venture

PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే

Date:

PMAY House Size Rules: దేశంలోని పేద కుటుంబాలకు శాశ్వత గృహాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం PMAY 2.0 అమలును కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించేందుకు రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో కేంద్రం నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలా..

గ్రామీణ ప్రాంతాల్లో అందించే రూ.1.20 లక్షలలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా భరిస్తాయి. అదనంగా మనరేగా కింద గృహ నిర్మాణ పనులకు వేతనాలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 వరకు అందజేస్తారు. దీంతో గ్రామీణ పేద కుటుంబాలకు మొత్తం ప్రయోజనం సుమారు రూ.1.50 లక్షల వరకు చేరుతుంది.

పట్టణ ప్రాంతాల్లో ఇలా..

పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల స్థిర సహాయం అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఆర్థిక సహాయం ప్రకటిస్తాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.1 లక్ష జోడించి మొత్తం సహాయాన్ని రూ.2.50 లక్షలకు పెంచగా, బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల అదనపు సాయం అందిస్తోంది.

ఇంటి కనీస విస్తీర్ణం ఎంత ఉండాలి..?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం PMAY-G కింద నిర్మించే ఇంటి కనీస విస్తీర్ణం 25 చదరపు మీటర్లు (సుమారు 269 చదరపు అడుగులు) ఉండాలి. ఈ పరిమాణం ఉన్న ఇంటికే ప్రభుత్వ సహాయం వర్తిస్తుంది. అంతకంటే పెద్ద ఇల్లు నిర్మించాలనుకుంటే లబ్ధిదారులు తమ సొంత నిధులతో అదనపు నిర్మాణం చేపట్టవచ్చు.

ఎన్ని గదులు ఉండాలి..?

ప్రామాణిక నమూనాల ప్రకారం ఇంటిలో కనీసం ఒక గది, వంటగది లేదా వంట స్థలం ఉండాలి. అవసరాన్ని బట్టి వరండా లేదా రెండు చిన్న గదులుగా నిర్మించుకునే అవకాశం కూడా ఉంది. అయితే టాయిలెట్‌ను ప్రధాన ఇంటి విస్తీర్ణంలో చేర్చరు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద అందే నిధులతో ఇంటికి ఆనుకుని లేదా కొద్దిదూరంలో ప్రత్యేకంగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలి. అంటే.. ప్రభుత్వం సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించే ఈ ఇళ్లు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శాశ్వతంగా ఉండే విధంగా రూపకల్పన చేయబడతాయి. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు సురక్షితమైన, శాశ్వత నివాసాన్ని సొంతం చేసుకునే అవకాశం కలుగుతోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അയോധ്യക്ക് പിന്നാലെ ബദരിനാഥിലും ഭണ്ഡാര കൊള്ള ആരോപണം; അന്വേഷണത്തിന് ഉത്തരവിട്ട് ക്ഷേത്ര കമ്മിറ്റി

ഡെറാഡൂണ്‍: അയോധ്യ രാമക്ഷേത്ര തട്ടിപ്പുമായി ബന്ധപ്പെട്ട വിവാദങ്ങള്‍ക്ക് പിന്നാലെ ബദരിനാഥ് ധാമിലെ...

அவதூறு வழக்கு: முன்னாள் அமைச்சர் அனிதா ராதாகிருஷ்ணன் கைதும் நள்ளிரவு ஜாமீனும்; என்ன நடந்தது?

கடந்த ஜூன் 20-ம் தேதி தூத்துக்குடி மாவட்டம் ஆத்தூரில், தி.மு.க சார்பில்...

Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?

Fact Check: యూపీలోని వారణాసిలో అత్యాచారం, మతమార్పిడి బెదిరింపులకు పాల్పడిన ఆరుగురు...

ಕೊಡಗಿನಲ್ಲಿ ಮಾನವ–ಆನೆ ಸಂಘರ್ಷ ನಿವಾರಣೆ: ಸಂಸದ ಯದುವೀರ್ ಮನವಿಗೆ ಕೇಂದ್ರದಿಂದ ಸ್ಪಂದನೆ

ಮೈಸೂರು, ಜುಲೈ,3, 2026 (www.justkannada.in): ಕೊಡಗು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿನ ಮಾನವ–ಆನೆ ಸಂಘರ್ಷ...