27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!

Date:

Pesara Garelu Recipe: ఉదయం పూట టిఫన్ గా లేదా సాయంత్రం వేళల్లో వేడివేడిగా తినడానికి “పెసర గారెలు” బెస్ట్ స్నాక్. సాధారణంగా వడలు, గారెలు అంటే శనగలు, బొబ్బర్లు లేదా అలచందలతో చేస్తుంటాం. అయితే ఒకసారి పెసలతో కూడా గారెలు తయారు చేసి చూడండి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ గారెలు నూనె కూడా ఎక్కువగా పీల్చవు. చాలా సులభంగా తయారయ్యే ఈ పెసర గారెలు ఇంట్లో అందరికీ నచ్చే రుచికరమైన వంటకంగా మారుతుంది.

కావలసిన పదార్థాలు:

* పెసలు – 2 కప్పులు
* అల్లం – 3 అంగుళాల ముక్క
* పచ్చిమిర్చి – 6
* ఎండుమిర్చి – 4
* ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
* కరివేపాకు – కొద్దిగా (సన్నగా తరిగినది)
* కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
* జీలకర్ర – అర టీస్పూన్
* ఉప్పు – తగినంత
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

ముందుగా పెసలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. పెసలు పూర్తిగా నానకపోతే గారెలు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. నానిన పెసలను మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కొద్దిగా కచ్చా బచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే జార్‌లో నానిన పెసలు వేసి కొద్దిగా నీళ్లు జోడిస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు పిండిలో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు మరియు ముందుగా గ్రైండ్ చేసిన అల్లం-మిర్చి మిశ్రమం వేసి బాగా కలపాలి. తర్వాత చేతిని కొద్దిగా తడిపి చిన్న చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్, ప్లాస్టిక్ కవర్ లేదా అరటాకుపై వడల మాదిరిగా ఒత్తాలి. మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. కడాయిలో నూనె వేడి చేసి మధ్యస్థ మంటపై గారెలను ఒక్కొక్కటిగా వేయాలి. మొదట కిందకు అంటుకున్నట్లు కనిపించినా కొద్దిసేపటి తర్వాత అవే పైకి తేలుతాయి. మధ్య మధ్యలో తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

గారెలు బాగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించి కొద్దిగా ఉప్పు చల్లి సర్వ్ చేయవచ్చు. ఈ పెసర గారెలు ఎలాంటి చట్నీ లేకుండానే చాలా రుచిగా ఉంటాయి. కావాలనుకుంటే కొబ్బరి చట్నీ, టమాటో సాస్‌తో కూడా తినవచ్చు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ పెసర గారెలు సాయంత్రం టీతో పాటు తింటే అద్భుతంగా ఉంటాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..

Hyderabad: గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ పరారీలో ఉన్నాడు. సూర్య కోసం...

ತಮಿಳು ಚಿತ್ರರಂಗದ ಹಿರಿಯ ನಿರ್ದೇಶಕ, ನಟ ಕೆ. ಭಾಗ್ಯರಾಜ್ ನಿಧನ

ಚೆನ್ನೈ, ಜೂನ್,27,2026 (www.justkannada.in):  ತಮಿಳು ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಿರ್ದೇಶಕ, ನಟ,...

ഉറ്റവരും ഉടയരവരും ഏറ്റെടുത്തില്ല; മുന്‍ ആര്‍.എസ്.എസ് പ്രവര്‍ത്തകന്റെ അന്ത്യകര്‍മങ്ങള്‍ ചെയ്ത് ലീഗ് വനിതാ നേതാവ്

കാസര്‍ഗോഡ്: കാന്‍സര്‍ ബാധിച്ച് മരിച്ച മുന്‍ ആര്‍.എസ്.എസ് പ്രവര്‍ത്തകന്റെ അന്ത്യ കര്‍മങ്ങള്‍...

`தமிழ்நாட்டில் தகுதியான பலர் இருக்கையில்..!' – டெல்லி பிரதிநிதி நியமனம்; விளக்கம் கேட்கும் பிரேமலதா!

தமிழ்நாட்டின் டெல்லி சிறப்புப் பிரதிநிதியாக வெங்கட நாராயணாவை நியமித்துள்ளது தமிழ்நாடு அரசு....