26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?

Date:

OnePlus Nord Buds 4 Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో కొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ OnePlus Nord Buds 4ను లాంచ్ చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, AI ఫీచర్లు, లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలతో ఈ ఇయర్‌బడ్స్ వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే.. గత మోడల్‌లో ఉన్న పెబుల్ ఆకారపు కేసుకు బదులుగా ఈసారి కొద్దిగా చతురస్రాకారంలో ఉండే వర్టికల్ ఛార్జింగ్ కేస్‌ను కంపెనీ అందించింది. ఒక్కో ఇయర్‌బడ్ కేవలం 4.3 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో ఎక్కువసేపు ధరించినా అసౌకర్యం కలగదు.

OnePlus Nord Buds 4లో 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. ఇవి మెరుగైన బాస్, క్లియర్ ఆడియో అనుభూతిని అందిస్తాయి. అలాగే 5000Hz బ్యాండ్‌విడ్త్‌తో కూడిన 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉండటం వల్ల బయటి శబ్దాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 6.1 కనెక్టివిటీ, SBC అండ్ AAC కోడెక్ సపోర్ట్, డ్యూయల్ డివైస్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాల్స్ సమయంలో స్పష్టమైన వాయిస్ కోసం ఒక్కో ఇయర్‌బడ్‌లో మూడు చొప్పున మొత్తం ఆరు మైక్రోఫోన్లు అమర్చారు. AI కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కాల్ నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుంది.

AI ఫీచర్ల విషయానికి వస్తే.. AI Assistant ద్వారా అలారంలు, రిమైండర్లు, వాతావరణ సమాచారం వంటి పనులను వాయిస్ ద్వారా నిర్వహించవచ్చు. అలాగే ఎంపిక చేసిన OnePlus స్మార్ట్‌ఫోన్లతో ఉపయోగించినప్పుడు AI ట్రాన్సలేట్ ఫీచర్, టైమ్ అనువాద సౌకర్యాన్ని అందిస్తుంది. బ్యాటరీ విషయంలో ANC ఆఫ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 13 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందుతుంది. ANC ఆన్‌లో 27 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండగా.. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల వరకు ప్లేబ్యాక్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

వీటికి IP55 రేటింగ్ లభించింది. దీంతో చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. టచ్ కంట్రోల్స్ ద్వారా పాటలను మార్చడం, ప్లే/పాజ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం వంటి పనులు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ స్టెల్లార్ బ్లాక్, ఆస్ట్రల్ టీల్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ధర విషయానికి వస్తే.. వీటి ధర రూ. 3,299గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా పరిమిత కాలానికి రూ. 3,099కే కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ ఇయర్‌బడ్స్ జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, మింత్రా, బ్లింకిట్, వన్ ప్లస్ స్టోర్లలో అమ్మకాలకు అందుబాటులో ఉంటాయి.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എസ്.ഐ.ആര്‍ ഒരുവര്‍ഷം പിന്നിട്ടപ്പോള്‍ വോട്ടര്‍ പട്ടികയില്‍ നിന്ന് പുറത്താക്കിയത് ആറ് കോടിയോളം വോട്ടര്‍മാരെ

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ തീവ്ര വോട്ടര്‍ പട്ടിക പുനപരിശോധന (എസ്.ഐ.ആര്‍) ഒരു വര്‍ഷം...

`கர்நாடக அரசின் பிராக்ஸி அரசா இந்த அரசு?' – ஜனநாயகன் பட தயாரிப்பாளர் நியமனத்திற்கு அதிமுக எதிர்ப்பு

தமிழ்நாடு அரசின் டெல்லி சிறப்புப் பிரதிநிதியாக ஜனநாயகன் திரைப்படத்தின் தயாரிப்பாளரான கே.வெங்கட...

Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక...

ಟೌನ್ ಶಿಪ್ ಹೆಸರಿನಲ್ಲಿ ರೈತರಿಂದ ಭೂಮಿ ಕಸಿದುಕೊಳ್ಳುವುದು ತಪ್ಪು- ಪ್ರತಾಪ್ ಸಿಂಹ

ಹಾಸನ,ಜೂನ್,26,2026 (www.justkannada.in):  ಬಿಡದಿಯ ಟೌನ್ ಶಿಪ್ ನಿರ್ಮಾಣ ವಿಚಾರ ಜಟಾಪಟಿ...