20
June, 2026

A News 365Times Venture

20
Saturday
June, 2026

A News 365Times Venture

Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్

Date:

ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ట్రంప్ దగ్గర నుంచి జీ 7 దేశాధినేతలంతో కీలక మంతనాలు చేశారు. ఇక తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. భారత్‌ను ఉద్దేశించి హిందీలో కీలక పోస్ట్ చేశారు. ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలంటూ… ప్రధాని మోడీకి హిందీలో శుభాకాంక్షలు తెలిపారు.

ఫ్రాన్స్-భారతదేశం మధ్య ఉన్న స్నేహబంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ మాక్రాన్ హిందీలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత విస్తరించాలనే సందేశాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రతినిధులు భారత ప్రధానికి హిందీలో అభినందనలు తెలియజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారత్-ఫ్రాన్స్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా మరింత బలోపేతమవుతున్నాయి. రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, వాణిజ్యం, విద్య, ఆవిష్కరణల వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమం కూడా ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది.

ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా వివాటెక్ (VivaTech) వంటి అంతర్జాతీయ సాంకేతిక వేదికల్లో పాల్గొని భారత్‌లోని ఆవిష్కరణలు, స్టార్టప్ వ్యవస్థ సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన స్నేహపూర్వక శుభాకాంక్షలు ఇరు దేశాల మధ్య ఉన్న విశ్వాసం, స్నేహానికి నిదర్శనంగా నిలిచాయి. భారత్-ఫ్రాన్స్ స్నేహబంధం భవిష్యత్తులో మరింత బలపడుతూ ప్రపంచ వేదికపై కీలక భాగస్వామ్యంగా కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വെടിനിര്‍ത്തല്‍ കരാറിലെത്തി ലെബനനും ഇസ്രഈലും

വാഷിങ്ടണ്‍: ഇസ്രഈലും ലെബനനിലെ ഹിസ്ബുല്ലകളും തമ്മില്‍ വെടിനിര്‍ത്തല്‍ കരാറിന് ധാരണയിലെത്തി. ഇരു...

"மோடி, ஜின்பிங் எனக்கு பிடித்தவர்கள்; நெதன்யாகுவை கொஞ்சம் நிதானமாக.!" – ட்ரம்ப்

அமெரிக்க அதிபர் ட்ரம்ப் அமெரிக்க செய்தி நிறுவனமான Axios-க்கு பிரத்யேக பேட்டி...

Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!

Off The Record: ఇంతకీ… విషయం ఏంటంటే….గోదావరి పుష్కరాల ప్రారంభానికి ఇక...

 ಕೊಳ್ಳೇಗಾಲ: ಕಾರು ಸೇತುವೆಗೆ ಡಿಕ್ಕಿ, ನ್ಯಾಯಾಂಗ ಇಲಾಖೆಯ 2 ಸಿಬ್ಬಂದಿ ಸಾವು, 3 ಗಂಭೀರ ಗಾಯ.

ಕೊಳ್ಳೇಗಾಲ, june.19,2026: ಪಟ್ಟಣದ ಮುಡಿಗುಂಡ ಸಮೀಪದ ಸುವರ್ಣವತಿ ಸೇತುವೆಗೆ ಕಾರು...