30
June, 2026

A News 365Times Venture

30
Tuesday
June, 2026

A News 365Times Venture

Cockfight: కోడిపందాలపై ఎస్‌ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..

Date:

శంషాబాద్ మండలంలోని బురుజుగడ్డ తండాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కోడిపందాల స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. బుర్జుగడ్డ తండా శివారు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా, రహస్యంగా ఈ కోడిపందాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, పందాల స్థావరాన్ని చుట్టుముట్టి అక్రమంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని రట్టు చేశారు.

ఈ దాడిలో కోడిపందాలు కాస్తూ, జూదానికి పాల్పడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఘటనాస్థలం నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. పందాల కోసం సిద్ధం చేసిన రూ. 3,82,000 నగదుతో పాటు, పందాలకు ఉపయోగిస్తున్న కోళ్లను మరియు నిందితులు అక్కడికి చేరుకోవడానికి ఉపయోగించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

అయితే, ఈ కోడిపందాల నిర్వహణను వెనకుండి నడిపిస్తూ, అంతా తానై పర్యవేక్షిస్తున్న ప్రధాన నిర్వాహకుడు మాత్రం పోలీసులు రాకను గమనించి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగే ఇలాంటి అక్రమ జూద కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టబోమని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കെ. സുധാകരന്റെ തൂഫാന്‍ യോഗത്തില്‍ പങ്കെടുത്തയാള്‍ ബാറില്‍ മദ്യപിച്ച് തല്ലുണ്ടാക്കിയതിന് പൊലീസ് പിടിയില്‍

കൊച്ചി: കൊച്ചിയില്‍ ഓപ്പറേഷന്‍ തൂഫാനെ പിന്തുണച്ച് കോണ്‍ഗ്രസ് നേതാവ് കെ. സുധാകരന്‍...

’சட்டமன்ற உறுப்பினர் பதவியை ராஜினாமா செய்கிறேனா?’ – எஸ்.பி.வேலுமணி சொல்வது என்ன?

அ.தி.மு.க-வில் அதிருப்தியில் உள்ள முன்னாள் அமைச்சர் எஸ்.பி.வேலுமணி, சட்டமன்ற உறுப்பினர் பதவியை...

HDK ನನ್ನ ಬಳಿ ಸಹಾಯ ಪಡೆದಿದ್ದಾರೆ: ಬೇಕಿದ್ರೆ ಬಹಿರಂಗ ಚರ್ಚೆಗೆ ಬರಲಿ- ಶಾಸಕ ಕದಲೂರು ಉದಯ್

ಮಂಡ್ಯ,ಜೂನ್,30,2026 (www.justkannada.in):  ಕೇಂದ್ರ ಸಚಿವ ಹೆಚ್ ಡಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ನನ್ನ...