21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్‌ కూడా అనుమానమేనా..?

Date:

Team India Injuries: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై పడింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తుండగా, ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కూడా సందేహాస్పదంగా మారింది.. అంతే కాదు హార్దిక్‌ పాండ్యా ఆడడం కూడా అనుమానం అంటున్నారు..

నివేదికల ప్రకారం, ఐపీఎల్ 2026 సమయంలో రోహిత్ శర్మకు కండరాల గాయం అయ్యింది. ఆ గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతని పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రోహిత్ కూడా అందుబాటులో లేకపోతే, భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. టీమ్ ఎంపిక సమయంలో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరికీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే జట్టులోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు రోహిత్‌కు ఆ క్లియరెన్స్ లభించలేదని తెలుస్తోంది.

మీడియా నివేదికల ప్రకారం, రోహిత్ శర్మ ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కూడా చేరుకోలేదు. దీంతో అతని లభ్యతపై మరింత సందేహాలు నెలకొన్నాయి. ఆటగాళ్లు జూన్ 9 నాటికి చండీగఢ్‌లో జట్టుతో కలవాల్సి ఉండగా, తొలి వన్డే జూన్ 13న ధర్మశాలలో జరగనుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ గైర్హాజరీ భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కోహ్లీ కండరాల గాయానికి గురైనట్లు సమాచారం. ఇప్పుడు రోహిత్ కూడా దూరమైతే, 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలకంగా భావిస్తున్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను భారత్ కోల్పోయినట్లే అవుతుంది.

రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యాడు. 2024లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు, 2025లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, 2027 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. అందువల్ల అతని ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో గాయం నుంచి తిరిగి వచ్చినప్పటికీ, రోహిత్‌ను ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఉపయోగించడం అతను పూర్తి ఫిట్‌గా లేడనే సంకేతాలను ఇచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు అతను దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే వన్డే జట్లలో చోటు దక్కించుకున్నప్పటికీ అరంగేట్రం చేయని జైస్వాల్, ఈ సిరీస్ ద్వారా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందవచ్చు. యువ ఆటగాళ్లకు ఇది పెద్ద పరీక్షగా మారనున్నప్పటికీ, భవిష్యత్ జట్టులో తమ స్థానాన్ని బలపరచుకునేందుకు ఇదొక మంచి వేదికగా కూడా మారనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.പിയില്‍ ബി.ജെ.പി ഭരണത്തില്‍ തകര്‍ത്തത് 151 അബേദ്ക്കര്‍ പ്രതിമകള്‍: അഖിലേഷ് യാദവ്

ലഖ്‌നൗ: ബി.ജെ.പി ഭരണകാലത്ത് ഉത്തര്‍പ്രദേശില്‍ ഡോ. ബി.ആര്‍ അംബേദ്‌റുടെ 151 പ്രതിമകള്‍...

"தமிழ்நாடு, சர்க்கஸ் கும்பலிடம் மாட்டிக்கொண்டிருக்கிறது.!"- உதயநிதி ஸ்டாலின்

சென்னையில் நடைபெற்ற திருமண நிகழ்ச்சியில் எதிர்க்கட்சி தலைவர் உதயநிதி ஸ்டாலின் கலந்துகொண்டிருக்கிறார்....

No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వ్యాపారులు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు దిగారు....

ഹിന്ദു സംസ്‌കാരത്തെ അപമാനിക്കുന്നതും പാരമ്പര്യത്തെ തകര്‍ക്കുന്നതും; ഹിന്ദു വര്‍ഗീയതയ്‌ക്കെതിരായ ഹാമിദ് അന്‍സാരിയുടെ പരാമര്‍ശത്തിനെതിരെ യോഗി

ന്യൂഡല്‍ഹി: മുന്‍ ഉപരാഷ്ട്രപതി ഹമീദ് അന്‍സാരിയുടെ ‘ഹിന്ദു വര്‍ഗീയത’യുമായി ബന്ധപ്പെട്ട പരാമര്‍ശങ്ങള്‍ക്കെതിരെ...