21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..

Date:

భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త షాక్ తగిలే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ బ్యాటర్, ఆ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేవలం మూడు నెలల క్రితమే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను ముద్దాడింది. అయితే.. ఆ చారిత్రాత్మక విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల చివర్లో జరగబోయే ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ పర్యటనలకు సంబంధించిన భారత జట్లను ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే ఈ లీకులు రావడం గమనార్హం.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా 2028లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా సరికొత్త జట్టును నిర్మించాలనే ప్లాన్‌లో బీసీసీఐ ఉంది. అందులో భాగంగానే కొత్త కెప్టెన్‌ను నియమించాలని చూస్తోంది. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాకుండా, జట్టులో సూర్యకుమార్ యాదవ్ స్థానంపై కూడా సెలెక్టర్లు చర్చించనున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం గత కొంతకాలంగా సూర్యకుమార్ ఫామ్ దారుణంగా పడిపోవడమే.

మొత్తంగా సూర్యకుమార్ యాదవ్ 113 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 36.35 సగటుతో 3272 పరుగులు చేశారు. కానీ, కెప్టెన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన గణాంకాలు భారీగా పడిపోయాయి. జూలై 2024 లో కెప్టెన్ కాకముందు ఆయన బ్యాటింగ్ సగటు 43.60 గా ఉండేది (4 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు). అయితే కెప్టెన్ అయ్యాక ఆ సగటు 25.88 కి పడిపోయింది. 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు ఆడిన 35 మ్యాచ్‌ల్లో కేవలం 26 సగటుతోనే పరుగులు చేశారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20.76 సగటుతో 270 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలోనే టీమిండియా భవిష్యత్తు కోసం బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹിന്ദു സംസ്‌കാരത്തെ അപമാനിക്കുന്നതും പാരമ്പര്യത്തെ തകര്‍ക്കുന്നതും; ഹിന്ദു വര്‍ഗീയതയ്‌ക്കെതിരായ ഹാമിദ് അന്‍സാരിയുടെ പരാമര്‍ശത്തിനെതിരെ യോഗി

ന്യൂഡല്‍ഹി: മുന്‍ ഉപരാഷ്ട്രപതി ഹമീദ് അന്‍സാരിയുടെ ‘ഹിന്ദു വര്‍ഗീയത’യുമായി ബന്ധപ്പെട്ട പരാമര്‍ശങ്ങള്‍ക്കെതിരെ...

`இன்னும் பழைய அரசாங்கத்தையே குறைச் சொல்லிக்கொண்டிருப்பதில் நியாயமில்லை' – விஜய்யை சாடிய எல்.முருகன்

மத்திய இணை அமைச்சர் எல்.முருகன், வேலூரில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது அவர்...

Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక్కరోజే సంచలనంగా మారిన యువ...

ಗಣೇಶೋತ್ಸವವನ್ನು ರಾಜಕೀಯ ಸಂಘರ್ಷದ ವೇದಿಕೆಯನ್ನಾಗಿಸಬಾರದು: ಎಚ್.ಎ. ವೆಂಕಟೇಶ್

  ಮೈಸೂರು, SEP.20,2026: ರಾಜ್ಯದಲ್ಲಿ ಗಣೇಶೋತ್ಸವ ಹಾಗೂ ವಿಸರ್ಜನಾ ಮೆರವಣಿಗೆಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ...